News October 15, 2024

ఎగ్జిట్ పోల్స్‌కు శాస్త్రీయత లేదు: రాజీవ్ కుమార్

image

ఎగ్జిట్ పోల్స్‌పై సీఈసీ రాజీవ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ పోల్స్‌కు శాస్త్రీయత లేదని, వాటి ఆధారంగా తమపై నిందలు వేయడం అర్థరహితమని అన్నారు. కౌంటింగ్ రోజున ఉదయం 9.30 గంటలకంటే ముందు ఇచ్చే ఫలితాలు బోగస్ అని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ అంచనా మాత్రమేనని, వీటిలో ఈసీ ప్రమేయం ఉండదని స్పష్టం చేశారు. కాగా ఇటీవల వెలువడిన ఫలితాల్లో హరియాణా ఎగ్జిట్ పోల్స్ తారుమారైన సంగతి తెలిసిందే.

Similar News

News December 11, 2025

నేడు క్యాబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఛాన్స్

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం ఇవాళ సమావేశం కానుంది. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, పారిశ్రామిక రంగం, అమరావతికి నాబార్డు రుణం, పలు అభివృద్ధి పనులపై చర్చించనుంది. గవర్నర్ నివాసంగా కొత్తగా లోక్‌భవన్ నిర్మాణానికి టెండర్లు, జుడీషియల్ అకాడమీకి పరిపాలన అనుమతులు ఇవ్వనుంది. అలాగే పలు సంక్షేమ కార్యక్రమాలపైనా చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

News December 11, 2025

దీక్షలో ఉన్నప్పుడు కాఫీ, టీ తీసుకోవచ్చా?

image

దీక్షలో ఉన్నప్పుడు కడుపు ఖాళీ ఉంటుంది. ఇదే సమయంలో టీ, కాఫీ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్య నిపుణుల సలహా! దీనివల్ల గ్యాస్, గుండెల్లో మంట, ఎసిడిటీ సమస్యలు వస్తాయని అంటున్నారు. ఒకటి కన్నా ఎక్కువ కప్పులు తీసుకోకూడదని, చక్కెర తక్కువగా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. శక్తిని కోల్పోకుండా ఉండేందుకు కొబ్బరి నీరు, నిమ్మరసం, పండ్ల రసాలు వంటి పానీయాలు తీసుకోవడం ఉత్తమం’ అని చెబుతున్నారు.

News December 11, 2025

మంచం మీద కూర్చొని ఎందుకు తినకూడదు?

image

ఇంట్లో ఆదాయం పెరగాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా జ్యోతిష నియమాలు పాటించాలని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. మంచం మీద కూర్చొని భోజనం చేయడం దరిద్రాన్ని ఆహ్వానించినట్టేనని అంటున్నారు. ‘ఇలా తినడం వల్ల అన్నపూర్ణ దేవికి కోపం వస్తుంది. ఫలితంగా డబ్బు రాక నిలిచిపోతుంది. ఇది ఇంట్లో ప్రతికూలతను పెంచుతుంది. వాస్తు దోషాలను సృష్టించి పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. ఆర్థిక నష్టాలు కలగవచ్చు’ అని వివరిస్తున్నారు.