News November 20, 2024
2019లో తప్పిన Exit Polls అంచనాలు

2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల Exit Polls అంచనాలు తప్పాయి. ఆ ఎన్నికల్లో BJP-శివసేన కూటమి ఘనవిజయం సాధిస్తుందని 7 సంస్థలు అంచనా వేశాయి. India Today-Axis My India *Patriotic Voter *NewsX-Pollstrat *ABP News-C Voter *Republic Media- Jan Ki Baat *Times Now *News18-IPSOS సంస్థలు BJP కూటమి 288 సీట్లలో 175-243 సీట్లు సాధిస్తుందని అంచనా వేశాయి. అయితే NDA 161, కాంగ్రెస్-NCP 98 సీట్లు గెలిచాయి.
Similar News
News September 17, 2025
మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి: పవన్

AP: సమాజంలో వైషమ్యాలు సృష్టించే శక్తులు పేట్రేగిపోతున్నాయని కలెక్టర్లు, SPల సదస్సులో Dy.CM పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ‘సామాజిక వర్గాల మధ్య అంతరాలు సృష్టించే విద్రోహ శక్తుల పట్ల నిరంతర అప్రమత్తత అవసరం. CM చంద్రబాబు శాంతిభద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. మహిళల భద్రతకు ప్రాధాన్యమివ్వండి. సుగాలి ప్రీతి కేసుపై ప్రత్యేక శ్రద్ధ చూపండి. డ్రగ్స్ వ్యాప్తిపై ఉక్కుపాదం మోపాలి’ అని ఆదేశించారు.
News September 17, 2025
చరిత్రలో ఈ రోజు: సెప్టెంబర్ 17

✒ 1906: స్వాతంత్ర్య సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య జననం
✒ 1915: భారత చిత్రకారుడు MF హుస్సేన్ జననం
✒ 1929: భారతీయ కామిక్స్ సృష్టికర్త అనంత్ పాయ్ జననం
✒ 1943: రాజకీయ నాయకుడు, సినీ నిర్మాత టి.సుబ్బరామిరెడ్డి జననం
✒ 1950: ప్రధాని నరేంద్ర మోదీ(ఫొటోలో) జననం
✒ 1948: నిజాం పరిపాలన నుంచి హైదరాబాద్కు విముక్తి
✒ 1986: దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ జననం
News September 17, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.