News May 31, 2024
రేపు సా.6.30 గంటల తర్వాతే ఎగ్జిట్ పోల్స్: ఈసీ

ఎగ్జిట్ పోల్స్‌పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపు సాయంత్రం 6.30 గంటల తర్వాతే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాలని తెలిపింది. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 126ఏ(1) ప్రకారం నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. కాగా రేపు ఏడో విడత పోలింగ్ జరగనుంది. దీంతో దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. జూన్ 4న ఫలితాలు వెలువడతాయి.
Similar News
News February 18, 2026
78ఏళ్ల వయసులో గోల్డ్ మెడల్

ఇండోర్‌కు చెందిన సుష్మా మౌఘే మరాఠీ సాహిత్యంలో మాస్టర్స్ చేసి గోల్డ్ మెడల్ అందుకున్నారు. గత నలభై ఏళ్లుగా సంగీత ఉపాధ్యాయురాలిగా చేసిన ఆమె కెమిస్ట్రీలో M.Sc కూడా చేశారు. అనేక పుస్తకాలు రచించడంతో పాటు హిందీ పుస్తకాలను మరాఠీలోకి అనువదించారు. 76ఏళ్ల వయసులో దేవి అహల్యా విశ్వవిద్యాలయంలో M.Aలో చేరి తాజాగా జరిగిన స్నాతకోత్సవంలో 78ఏళ్ల వయసులో గోల్డ్ మెడల్ అందుకొని ఎందరికో ఆదర్శంగా నిలిచారు.
News February 18, 2026
ఫాల్గుణ మాసంలో ఎవరెవరు పుట్టారంటే?

ఫాల్గుణ మాసం అనేక పురాణ పురుషుల, మహాత్ముల జన్మలకు వేదిక. ఈ మాసంలోనే హరిహరసుతుడు అయ్యప్పస్వామి, పాలకడలి నుంచి లక్ష్మీదేవి ఆవిర్భవించారు. శ్రీకృష్ణ చైతన్యులు, రామకృష్ణ పరమహంస, స్వామి దయానంద సరస్వతి వంటి మహనీయులు కూడా ఈ మాసంలోనే జన్మించారు. అర్జునుడు, ధర్మరాజు, భీముడు ఈ మాసంలోనే జన్మించారు. కొందరు కౌరవ వీరులు కూడా ఫాల్గుణ మాసంలోనే జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి.
News February 18, 2026
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(HPCL) ఇంజినీర్, Jr. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, తదితర పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు FEB 25 నుంచి మార్చి 25 వరకు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష(CBT), గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. త్వరలో పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల కానుంది. వెబ్‌సైట్: https://www.hindustanpetroleum.com/


