News June 2, 2024
ఎగ్జిట్ పోల్స్: ఒడిశాలో BJP, బీజేడీ మధ్య టఫ్ ఫైట్

ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో BJP, బిజూ జనతా దళ్(బీజేడీ) పార్టీల మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని India Today Axis My India ఎగ్జిట్ పోల్స్ పేర్కొంది. ఇరు పార్టీలకు 62-80 సీట్ల చొప్పున వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. ఏ పార్టీ గెలుస్తుందో క్లారిటీ ఇవ్వలేదు. కాంగ్రెస్ 5-8 స్థానాల్లో గెలుస్తుందని అభిప్రాయపడింది. అత్యధికంగా BJDకి 42%, బీజేపీకి 41%, కాంగ్రెస్‌కు 12%, ఇతరులకు 4-5 శాతం ఓట్లు రావొచ్చని తెలిపింది.
Similar News
News January 21, 2026
గుడ్‌న్యూస్.. మరో ఐదేళ్లు అటల్ పెన్షన్ యోజన

అసంఘటిత రంగ కార్మికులకు పెన్షన్ అందించేందుకు తీసుకొచ్చిన అటల్ పెన్షన్ యోజన(APY) పథకాన్ని కొనసాగించాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. మరో ఐదేళ్లు(2030-31) పొడిగించేందుకు అంగీకారం తెలిపింది. ప్రస్తుతం APYలో 8.66 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. 18-40 ఏళ్ల వారు ఈ స్కీమ్‌లో చేరొచ్చు. వయసును బట్టి రూ.42 నుంచి రూ.1,454 వరకు చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్లు దాటాక రూ.1000-5000 వరకు పెన్షన్ అందుతుంది.
News January 21, 2026
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

<
News January 21, 2026
‘2000s’ గ్యాంగ్.. క్రికెటర్ల సెల్ఫీ వైరల్

2000దశకంలో క్రికెట్ చూడటం మొదలుపెట్టిన వారికి పైఫొటోలో ఎవరో ఒకరు ఫేవరెట్ ప్లేయరై ఉంటారు. ఓపెనర్‌గా సెహ్వాగ్ బాదుడు, సిక్సర్ల వీరుడు యువరాజ్, ఫీల్డింగ్‌లో కైఫ్ దూకుడు, బౌలింగ్‌లో అగార్కర్, నెహ్రా సత్తా.. ఇలా అప్పట్లో వీరి ఆటకు క్రేజే వేరు. తాజాగా వీరంతా ఒకే దగ్గర కలుసుకొని సెల్ఫీ దిగారు. లెజెండరీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ కుమారుడు అంగద్ బేడీ, స్పోర్ట్స్ ప్రజెంటర్ గౌరవ్ కపూర్ కూడా వీరితో ఉన్నారు.


