News November 23, 2024
ఝార్ఖండ్‌లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు

ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్తోంది. JMM-కాంగ్రెస్ మిత్రపక్షాలు అధికారం చేపట్టడానికి అవసరమైన 41 స్థానాల మేజిక్ ఫిగర్‌ను దాటేశాయి. ప్రస్తుతం 51 సీట్లలో లీడింగ్‌లో ఉన్నాయి. అయితే ఈనెల 20న వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఝార్ఖండ్‌లో కమలం వికసిస్తుందని జోస్యం చెప్పాయి. మై యాక్సిస్ ఇండియా మినహా అన్ని సంస్థలూ NDAకే పట్టం కట్టాయి. కానీ ఇవాళ ఆ అంచనాలన్నీ తలకిందులయ్యాయి.
Similar News
News November 26, 2025
టీటీడీకి రూ.9 కోట్ల భారీ విరాళం

AP: ఇటీవల ఉదయ్‌పూర్‌లో అట్టహాసంగా కూతురి పెళ్లి చేసిన బిలియనీర్ మంతెన రామలింగరాజు తిరుమల శ్రీవారికి భారీ విరాళం ప్రకటించారు. PAC 1,2,3 భవనాల ఆధునికీకరణ కోసం కూతురు నేత్ర, అల్లుడు వంశీ పేరిట రూ.9కోట్లు ఇచ్చినట్లు TTD ఛైర్మన్ BR నాయుడు తెలిపారు. రామలింగరాజు 2012లోనూ శ్రీవారికి రూ.16 కోట్ల భారీ విరాళం ఇచ్చారు. ఇటీవల ఆయన కూతురి వివాహానికి ట్రంప్ కుమారుడు సహా హాలీవుడ్ దిగ్గజాలు తరలివచ్చారు.
News November 26, 2025
పలాశ్ను అన్‌ఫాలో చేసిన స్మృతి.. నిజమిదే!

కాబోయే భర్త పలాశ్ ముచ్చల్‌తో పెళ్లికి ముందు వేడుకల ఫొటోలను స్మృతి మంధాన డిలీట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇన్‌స్టాలో అతడిని ఆమె అన్‌ఫాలో చేశారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే అది అవాస్తవమని తేలింది. పలాశ్ను ఆమె ఫాలో అవుతున్నారు. స్మృతి తండ్రికి గుండెపోటు రావడంతో ఈ నెల 23న జరగాల్సిన పెళ్లి వాయిదా పడింది. పలాశ్ చాటింగ్ బయటపడటంతో పెళ్లి మొత్తానికే రద్దయిందంటూ SMలో ప్రచారం జరుగుతోంది.
News November 26, 2025
ఢిల్లీలో గాలి కాలుష్యం.. శిశువులకు ఆటిజం ప్రమాదం

దేశ రాజధాని <<18386999>>ఢిల్లీ<<>>లో గాలి కాలుష్యం గర్భిణులు, నవజాత శిశువులకు హాని కలిగిస్తుందని వైద్యులు చెబుతున్నారు. PM2.5 కణాలు రక్తంలోకి చేరి గర్భంలోని శిశువు మెదడు పెరుగుదలపై ప్రభావం చూపి ఆటిజం ప్రమాదాన్ని పెంచుతుందని తెలిపారు. గాలి కాలుష్యం ఊపిరితిత్తులకు మాత్రమే హాని కాదని, శరీరంలోని నాడీ వ్యవస్థపైనా ప్రభావం చూపిస్తుందన్నారు. మెదడు పనితీరు తగ్గడంతోపాటు జ్ఞాపకశక్తి మందగిస్తుందని ఒక సర్వేలో తేలింది.


