News December 5, 2024

విస్త‌రిస్తున్న సిరియా రెబ‌ల్స్‌.. మరో నగరంలో పాగా

image

సిరియాలో అంత‌ర్యుద్ధం ముదురుతోంది. ఇటీవ‌ల అలెప్పో న‌గ‌రాన్ని రెబ‌ల్స్ త‌మ అధీనంలోకి తీసుకున్నారు. దీంతో సిరియా దాని మిత్ర‌దేశాలు ర‌ష్యా, ఇరాన్‌లు జరిపిన రిటాలియేషన్‌ను లెక్క‌చేయ‌కుండా తాజాగా హ‌మా న‌గ‌రంలో పాగా వేశారు. సిరియా రాజ‌ధాని ద‌మాస్క‌స్‌కు ఉత్త‌రాన 210KM దూరంలోని హమాలోకి హ‌య‌త్ త‌హ్రీర్ అల్‌-షామ్ నేతృత్వంలోని రెబల్స్ చొచ్చుకురావ‌డంతో అధ్యక్షుడు బ‌ష‌ర్ అల్‌-అస‌ద్‌కు స‌వాల్ విసిరినట్టైంది.

Similar News

News September 18, 2025

కోళ్లలో రక్తపారుడు వ్యాధి – లక్షణాలు

image

కోళ్లలో వైరస్, సూక్ష్మజీవుల వల్ల రక్తపారుడు వ్యాధి వస్తుంది. ఇది కూడా చిన్న కోడి పిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోగం వస్తే కోళ్లలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. వ్యాధి బారినపడ్డ కోడి పిల్లలు ఒకేచోట గుమిగూడి రక్త విరేచనాలతో బాధపడతాయి. లక్షణాలు మరీ తీవ్రంగా మారితే కోడి పిల్లలు మరణించే అవకాశం ఉంది. వ్యాధి నివారణకు <<17696499>>లిట్టరు<<>>ను పొడిగా ఉంచాలి. వెటర్నరీ నిపుణులకు తెలిపి వారి సలహాలను పాటించాలి.

News September 18, 2025

OFFICIAL: ‘కల్కి-2’ నుంచి దీపికా పదుకొణె ఔట్

image

రెబల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి’ మూవీలో కీలక పాత్రలో నటించిన దీపికా పదుకొణె రాబోయే సీక్వెల్‌లో నటించబోరని మేకర్స్ ప్రకటించారు. ‘కల్కి-2లో దీపిక భాగం కాదని ప్రకటిస్తున్నాం. అన్నివిధాలుగా పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం. కల్కిలాంటి సినిమాలో నటించే నటులకు ఎక్కువ కమిట్మెంట్ అవసరం. దీపిక తదుపరి సినిమాలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం’ అని వైజయంతి మూవీస్ ట్వీట్ చేసింది.

News September 18, 2025

గర్భంపై గ్లైఫోసేట్ ఎఫెక్ట్

image

గ్లైఫోసేట్‌ను పంటల్లో కలుపు నివారణకు వాడతారు. అయితే ఇది ప్రెగ్నెన్సీపై ప్రభావం చూపుతుందంటున్నారు పరిశోధకులు. ముఖ్యంగా పిండం నాడీ వ్యవస్థ వృద్ధి చెందే మొదటి త్రైమాసికంలో గ్లైఫోసేట్‌కు వీలైనంత దూరంగా ఉండాలి. లేదంటే అబార్షన్ జరగడం లేదా బిడ్డ పుట్టాక ఎదుగుదల లోపాలు వస్తాయి. గ్లైఫోసేట్‌ను మొక్కజొన్న, సోయా బీన్ పంటల్లో ఎక్కువగా వాడతారు. కాబట్టి ప్రెగ్నెన్సీలో ఈ పదార్థాలను అవాయిడ్ చేయడం మంచిది.