News May 4, 2024

ఐపీఎల్‌లో హైబ్రిడ్ పిచ్‌లతో ప్రయోగం!

image

ఈ సీజన్ ఐపీఎల్‌లో పిచ్‌లు బ్యాటింగ్‌కు మరీ అనుకూలంగా ఉన్నాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ధర్మశాల స్టేడియంలో హైబ్రిడ్ పిచ్‌ను బీసీసీఐ ప్రయోగాత్మకంగా పరిశీలించనుంది. సిస్‌గ్రాస్ సంస్థ రూపొందిస్తున్న ఈ పిచ్‌లో సహజసిద్ధమైన గడ్డి, పాలిమర్ ఉండటంతో బౌలర్లకు చక్కటి బౌన్స్ లభించనుంది. ధర్మశాలలో రేపు CSKతో, 9న RCBతో పంజాబ్ ఆడే మ్యాచుల్లో హైబ్రిడ్‌ పిచ్‌లను వినియోగించనున్నారు.

Similar News

News December 5, 2025

నేడు ఈ జిల్లాల్లో వర్షాలు: APSDMA

image

AP: ప్రకాశం, శ్రీసత్యసాయి, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఇవాళ అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని APSDMA అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వానలు పడేందుకు ఛాన్స్ ఉందని పేర్కొంది. గురువారం 5PM వరకు తిరుపతి(D) చిట్టమూరులో 88.5MM, చింతవరంలో 81MM, నెల్లూరులో 61MM, పాలూరులో 60MM వర్షపాతం నమోదైందని తెలిపింది.

News December 5, 2025

చలికాలం.. నిండా దుప్పటి కప్పుకుంటున్నారా?

image

చలికాలం కావడంతో కొందరు తల నుంచి కాళ్ల వరకు ఫుల్‌గా దుప్పటిని కప్పుకొని పడుకుంటారు. ఇలా చేస్తే శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ అందక రక్తప్రసరణ తగ్గి గుండెపై ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జీర్ణక్రియ కూడా మందగిస్తుందట. ‘దుప్పటి ముఖానికి అడ్డుగా ఉంటే CO2 లెవల్స్ పెరిగి మెదడు పనితీరుపై ఎఫెక్ట్ చూపుతుంది. O2, Co2 మార్పిడికి అడ్డంకి ఏర్పడి శ్వాసకోస సమస్యలొస్తాయి’ అని చెబుతున్నారు.

News December 5, 2025

పాక్ తొలి CDFగా ఆసిమ్ మునీర్ నియామకం

image

పాకిస్థాన్ ఫీల్డ్ మార్షల్‌గా ఉన్న ఆసిమ్ మునీర్‌ను ఆ దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్(CDF)గా నియమిస్తూ అధ్యక్ష కార్యాలయం ప్రకటన జారీ చేసింది. ఆర్మీ స్టాఫ్ చీఫ్ పదవితో పాటు CDFగానూ ఐదేళ్ల పాటు కొనసాగుతారని చెప్పింది. అలాగే ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ పదవీ కాలాన్ని రెండేళ్లు పొడిగించింది. వీరిద్దరికి అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ శుభాకాంక్షలు తెలిపినట్లు అధ్యక్ష కార్యాలయం పేర్కొంది.