News October 29, 2024

మంగళగిరిలో ప్రయోగాత్మకంగా డ్రోన్ పరీక్ష

image

AP: వైద్యరంగంలో సరికొత్త సేవలకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. ఎయిమ్స్‌లో ప్రయోగాత్మకంగా డ్రోన్ సేవలను ప్రారంభించారు. మంగళగిరి ఎయిమ్స్ నుంచి 12KM దూరంలోని నూతక్కి PHCకి డ్రోన్‌ని పంపారు. అక్కడ మహిళా రోగి బ్లడ్ శాంపిల్స్‌ను సేకరించి తిరిగొచ్చింది. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు డ్రోన్ల వాడకంపై ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా 11 చోట్ల ఈ సేవలను పరీక్షించారు.

Similar News

News January 7, 2026

మున్సిపల్ ఎన్నికలపై SEC సన్నాహాలు

image

TG: మున్సిపల్ ఎన్నికలపై స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల ముందస్తు ఏర్పాట్లకు ఆదేశాలిచ్చారు. ‘JAN 12న వార్డుల వారీ ఓటర్ల తుది జాబితాను ప్రచురించాలి. 13న పోలింగ్ కేంద్రాల జాబితాను ‘T పోల్’లో పొందుపర్చాలి. 16న పోలింగ్ కేంద్రాల వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ల తుది జాబితాను విడుదల చేయాలి’ అని ఆదేశించారు. బ్యాలెట్ బాక్సులు, సిబ్బంది నియామకాన్ని ముమ్మరం చేయాలన్నారు.

News January 7, 2026

కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

image

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కబీంద్ర పుర్కాయస్థ(94) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో సిల్చార్ (అస్సాం)లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1931లో జన్మించిన ఈయన 1991, 98, 2009లో లోక్‌సభ ఎంపీగా గెలిచారు. బీజేపీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. వాజ్‌పేయి హయాంలో కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా పని చేశారు. కబీంద్ర మరణం పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.

News January 7, 2026

అక్కడ బీజేపీ-MIM పొత్తు

image

అంబర్‌నాథ్(MH)లో BJP, కాంగ్రెస్ <<18786772>>పొత్తు<<>> దుమారం రేపగా, అకోలాలో BJP-MIM కలిసిపోవడం చర్చనీయాంశమవుతోంది. అకోలా మున్సిపల్ కౌన్సిల్‌లో 33 సీట్లకు ఎన్నికలు జరగ్గా BJP 11, కాంగ్రెస్ 6, MIM 5, మిగతా పార్టీలు 11 చోట్ల గెలిచాయి. ఈ క్రమంలో MIM, ఇతర పార్టీలతో కలిసి కూటమిని BJP స్థానిక యూనిట్ ఏర్పాటు చేసింది. మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. అయితే MIMతో పొత్తును అంగీకరించబోమని CM ఫడణవీస్ స్పష్టం చేశారు.