News January 28, 2025

ఎక్స్‌పీరియం పార్క్ అద్భుతమైన కళాఖండం: చిరంజీవి

image

TG: రంగారెడ్డి జిల్లా ప్రొద్దుటూరులో 150ఎకరాల్లో నిర్మించిన ఎక్స్‌పీరియం పార్క్ అద్భుతమైన కళాఖండం అని హీరో చిరంజీవి అన్నారు. ఈ థీమ్ పార్క్ HYDకు ల్యాండ్ మార్క్ అని, దీంతో నగరంలో టూరిజం మరింత పెరుగుతుందని తెలిపారు. ఈ పార్కును చూసి తాను, CM ఆశ్చర్యానికి గురయ్యామని చెప్పారు. పార్క్‌ని షూటింగ్స్‌కు ఇస్తారా? అని అధినేత రాందేవ్‌ను అడిగితే, ఫస్ట్ తన సినిమా అయితేనే ఇస్తామన్నారని చిరంజీవి సరదాగా చెప్పారు.

Similar News

News September 13, 2025

వైద్యులపై దాడి చేస్తే కఠిన చర్యలు: సత్యకుమార్

image

AP: చికిత్స విషయంలో చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో శుక్రవారం అర్ధరాత్రి డాక్టర్లు, సిబ్బందిపై కొందరు దాడి చేయడాన్ని మంత్రి సత్యకుమార్ ఖండించారు. వైద్యులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ‘స్టాఫ్ వ్యవహారశైలిలో లోపాలు ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి. వారిపై దాడులు చేసి వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించవద్దు. ఇది సరైంది కాదు’ అని Xలో పేర్కొన్నారు.

News September 13, 2025

షాకింగ్: HD క్వాలిటీతో ‘మిరాయ్’ పైరసీ!

image

కొత్త సినిమాలను పైరసీ బెడద వీడట్లేదు. నిన్న విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ‘మిరాయ్’ సినిమా ఆన్‌లైన్‌లో దర్శనమిచ్చిందని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. మూవీ HD క్వాలిటీతో అందుబాటులో ఉందని చెబుతున్నారు. ఇది దారుణమని, సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. మేకర్స్ దీనిపై దృష్టి పెట్టి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.

News September 13, 2025

సంక్షేమ పథకాలపై ప్రజల్లో సంతృప్తే ముఖ్యం: CM చంద్రబాబు

image

AP: 15% వృద్ధి రేటు లక్ష్యంగా పని చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించనున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్‌పై మంత్రులు, అధికారులతో ఆయన సమావేశమయ్యారు. పౌరసేవలతో పాటు సంక్షేమ పథకాలపై ప్రజల్లో సంతృప్తే ముఖ్యమని, దానికి అనుగుణంగానే మంత్రులు, ప్రజాప్రతినిధులు పని చేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో 3% వృద్ధి తగ్గడంతో రాష్ట్రం సుమారుగా రూ.6 లక్షల కోట్ల సంపదను కోల్పోయిందన్నారు.