News June 2, 2024
ముగిసిన గడువు.. ఇవాళ జైలుకి కేజ్రీవాల్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ జైల్లో లొంగిపోనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన తిహార్ జైలుకు వెళ్తారు. లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన కేజ్రీవాల్ లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఆ గడువు ఇవాళ్టితో ముగిసింది. మరోవైపు ఢిల్లీ కోర్టులో ఆయన వేసిన బెయిల్ పిటిషన్‌పై తీర్పు జూన్ 5న రానుంది.
Similar News
News January 21, 2025
PHOTOS: ఫ్యామిలీతో అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో దిగిన కొత్త ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. భార్య స్నేహా రెడ్డితో పాటు కొడుకు అయాన్, కూతురు అర్హ వైట్ టీషర్టు ధరించి కెమెరాలకు పోజులిచ్చారు. మొన్నటి వరకు ‘పుష్ప-2’ సినిమా కోసం హెయిర్, బియర్డ్ పెంచిన బన్నీ.. తాజాగా తన లుక్‌ను మార్చేసిన విషయం తెలిసిందే. కాగా, మార్చి నెల నుంచి త్రివిక్రమ్- అల్లు అర్జున్ కాంబోలో సినిమా ప్రారంభం కానుంది.
News January 21, 2025
భారత్‌తో తొలి T20.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన
భారత్‌తో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో రేపు జరిగే తొలి T20 కోసం ఇంగ్లండ్ జట్టును ప్రకటించింది. బట్లర్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, సాల్ట్(కీపర్), డక్కెట్, బ్రూక్, లివింగ్ స్టోన్, బెథెల్, ఓవర్టన్, అట్కీన్‌సన్, అర్చర్, రషీద్, వుడ్ జట్టులో ఉండనున్నారు. ఈ మేరకు జట్టును కోచ్ మెక్‌కల్లమ్ ప్రకటించారు.
News January 21, 2025
రేపటి నుంచి INDvsENG టీ20 సిరీస్
భారత్, ఇంగ్లండ్ మధ్య రేపటి నుంచి 5 మ్యాచుల టీ20 సిరీస్ జరగనుంది. రేపు తొలి మ్యాచ్ కోల్‌కతా వేదికగా రా.7 గంటలకు ప్రారంభం అవుతుంది. స్టార్ స్పోర్ట్స్ టీవీ ఛానల్, హాట్ స్టార్ యాప్‌లో లైవ్ చూడవచ్చు. తర్వాతి మ్యాచులు ఈనెల 25 (చెన్నై), 28 (రాజ్‌కోట్), 31 (పుణే), ఫిబ్రవరి 2(ముంబై) తేదీల్లో జరగనున్నాయి. 3 మ్యాచుల వన్డే సిరీస్ (నాగ్‌పూర్, కటక్, అహ్మదాబాద్) FEB 6 నుంచి జరగనుంది.