News August 8, 2024

వినేశ్ వీడ్కోలు నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా వివరిస్తా: మహావీర్

image

రెజ్లర్ వినేశ్ ఫొగట్ <<13802900>>రిటైర్మెంట్<<>> నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఆమె చిన్ననాటి కోచ్ మహావీర్ ఫొగట్ సూచించారు. ‘మెడల్‌కు చేరువగా వచ్చి కోల్పోవడం ఆమెను మానసికంగా కుంగదీసింది. దీంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. వినేశ్‌ తిరిగొచ్చాక ఆమెతో మాట్లాడి మనసు మార్చుకునేలా వివరిస్తా. తీవ్రంగా శ్రమిస్తే విజయం కష్టమేమీ కాదు’ అని తెలిపారు. ఈయన జీవితం ఆధారంగా దంగల్ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.

Similar News

News December 18, 2025

ఐఐటీ హైదరాబాద్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

<>ఐఐటీ<<>> హైదరాబాద్ 4 జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. BE/B.Tech లేదా డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల JE (ఎలక్ట్రికల్) డిసెంబర్ 22న, JE (సివిల్) డిసెంబర్ 23న ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. ఎంపికైనవారికి నెలకు రూ.50,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.iith.ac.in/

News December 18, 2025

గర్భంతో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చెయ్యొద్దు

image

గర్భధారణ సమయంలో ఒకే పొజిషన్‌లో ఎక్కువ సేపు ఉండడం అంత మంచిది కాదు. ప్రెగ్నెన్సీలో ఆరోగ్య సమస్యలకు సొంత వైద్యం పనికిరాదు. బరువైన వస్తువులను ఎత్తడం, అధిక పని చేయడం మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వైద్యుల సూచనలు తప్పనిసరిగా పాటించాలి. మద్యం, ధూమపానం చేయకూడదు. కెఫీన్ తగ్గించాలి. పచ్చి ఆహారాలను తినకూడదని సూచిస్తున్నారు. సమయానికి తగ్గట్లు స్కానింగ్‌లు చేయించుకోవాలి.

News December 18, 2025

గురువారం రోజు చేయకూడని పనులివే..

image

గురువారం బృహస్పతి గ్రహంతో అనుసంధానమై ఉంటుంది. వాస్తు ప్రకారం ఈ రోజున కొన్ని వస్తువులు కొనడం మంచిది కాదని నమ్ముతారు. నలుపు రంగు వస్తువులు, బూట్లు, నూనె, ఇనుము/స్టీల్ వస్తువులు కొనడం అశుభమని పండితులు చెబుతున్నారు. అలాగే ఆస్తి లావాదేవీలు చేపడితే ప్రతికూల ప్రభావాలు కలగొచ్చంటున్నారు. నేడు జుట్టు, గోళ్లను కత్తిరించకూడదట. అయితే శత్రువుల బెడద తగ్గడానికి మట్టి కుండ కొనాలని సూచిస్తున్నారు.