News January 3, 2025
సంక్రాంతికి ట్రావెల్స్ సంస్థల దోపిడీ
సంక్రాంతికి ఊళ్లు వెళ్లేవారిని ట్రావెల్స్ సంస్థలు అడ్డగోలుగా దోచుకుంటున్నాయి. రైలు టికెట్లు నెలల ముందే నిండిపోవడం, ఆర్టీసీలోనూ ఖాళీలు లేకపోవడంతో ప్రయాణికులకు వేరే దారి లేని సందర్భాన్ని వాడుకుంటున్నాయి. హైదరాబాద్ నుంచి వైజాగ్‌కు ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు టికెట్ ధర రూ.6వేలు ఉండటం పరిస్థితికి అద్దం పడుతోంది. ప్రైవేటు ఆపరేటర్ల దోపిడీని ప్రభుత్వాలు అడ్డుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Similar News
News January 5, 2025
ఓడినా.. చాలా పాజిటివ్ అంశాలున్నాయి: గంభీర్
ఆశించిన మేర రాణించకపోవడంతోనే BGT కోల్పోయామని కోచ్ గంభీర్ అన్నారు. మెరుగైన ప్రదర్శనకు బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో వర్కౌట్ చేయాల్సి ఉందని చెప్పారు. ఈ సిరీస్‌లో చాలా పాజిటివ్ అంశాలున్నాయన్నారు. AUSపై తొలి పర్యటనలోనే నితీశ్, ఆకాశ్, జైస్వాల్, ప్రసిద్ధ్ రాణించారని చెప్పారు. సిరాజ్ మంచి ప్రదర్శన చేశారని కొనియాడారు. భారత్ 5నెలల తర్వాత తిరిగి టెస్టులు ఆడనుందని, అప్పటికి అన్నీ సెట్ అవుతాయని చెప్పారు.
News January 5, 2025
శ్రీతేజ్ పరామర్శకు వెళ్లొద్దు.. అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు
TG: జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్ నివాసానికి రాంగోపాల్‌పేట పోలీసులు వెళ్లారు. కిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు వెళ్లొద్దని బన్నీ మేనేజర్ మూర్తికి నోటీసులు ఇచ్చారు. బెయిల్ షరతులను పాటించాలని స్పష్టం చేశారు. శ్రీతేజ్ పరామర్శకు ఆయన వస్తాడన్న సమాచారంతో నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ కిమ్స్‌కు వస్తే అక్కడ జరిగే పరిణామాలకు బన్నీనే బాధ్యత వహించాలని పేర్కొన్నారు.
News January 5, 2025
4 లక్షల పాస్‌పోర్టుల జారీనే లక్ష్యం
AP:పాస్‌పోర్టుల జారీని మరింత వేగంగా, ఎక్కువ సంఖ్యలో ఇచ్చే సామర్థ్యాన్ని పెంచుకున్నట్లు విజయవాడ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయ అధికారి శివ హర్ష తెలిపారు. 2024-25లో 3.23 లక్షల పాస్‌పోర్టులు అందించామని, 2025-26లో 4 లక్షల పాస్‌పోర్టులను జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. VJY, TPTY పాస్‌పోర్టు సేవా కేంద్రాలు, 13 పోస్టాఫీస్ సేవా కేంద్రాల్లో రోజుకు 1800 అపాయింట్మెంట్స్ ఇస్తున్నామన్నారు.