News February 16, 2025
రూ.62కోట్ల నష్టం తెచ్చిపెట్టిన ఎక్స్ప్రెస్

సాధారణంగా రైళ్లలో చాలా రద్దీ ఉంటుంది. సీటు దొరకడమే కష్టం. అయితే ఢిల్లీ-లక్నో, అహ్మదాబాద్-ముంబై మార్గాల్లో నడిచే తేజస్ ఎక్స్ప్రెస్ ప్రయాణికుల కొరతతో ఇబ్బంది పడుతోంది. గత మూడేళ్లుగా ఈ ట్రైన్ వల్ల రైల్వేశాఖకు రూ.62.88 కోట్ల నష్టం వచ్చింది. దీంతో దీని నిర్వహణ బాధ్యతను రైల్వే IRCTCకి అప్పగించింది. అయినప్పటికీ తగినంతగా ప్యాసింజర్లు లేక నష్టాల మార్గంలో ప్రయాణిస్తోంది.
Similar News
News December 1, 2025
గర్భిణుల్లో వికారానికి కారణమిదే..

ప్రెగ్నెన్సీలో వికారం కామన్. అయితే ఇది గర్భంలోని శిశువును రక్షించే ప్రక్రియలో భాగమని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ నిపుణులు చేసిన పరిశోధనలో తేలింది. కొత్తగా వచ్చిన శిశువుని శరీరం అంగీకరించి, హానికర పదార్థాల నుంచి రక్షించడానికి ప్రయత్నిస్తుంది. శిశువు DNAలో సగం తండ్రిది కావడంతో పిండాన్ని తల్లి శరీరం ఫారెన్ బాడీగా భావిస్తుంది. కొత్తగా శరీరంలో ప్రవేశించిన దేనిమీదైనా దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది.
News December 1, 2025
దేవుడు మీకేం ఇవ్వలేదని బాధపడుతున్నారా?

పురాణాల్లో దేవుడు కొందరికి ఎన్నో గొప్ప వరాలిచ్చాడని, మాకేం ఇవ్వలేదని కొందరు బాధ పడుతుంటారు. కానీ సమస్త మానవాళికి ఆయన ఓ గొప్ప వరాన్ని అందించాడు. అదే మనకు జ్ఞాన మార్గాన్ని చూపించే ‘భగవద్గీత’. మనిషి మనిషిగా జీవించేందుకు, ధర్మబద్ధంగా ముందుకు వెళ్లేందుకు ఇంతకంటే గొప్ప బహుమానం, వరం ఇంకేమైనా ఉంటుందా? అందుకే గీతా పారాయణం చేయాలంటారు పెద్దలు. గీతా పారాయణం చేద్దాం.. దేవుడిచ్చిన ఈ జన్మను సార్థకం చేసుకుందాం!
News December 1, 2025
ఉపాధి కూలీలకు ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్

AP: దొంగ మస్టర్ల కట్టడికి కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉన్న ఉపాధి కూలీలకు ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానం తీసుకురావాలని భావిస్తోంది. ఇవాళ ప్రయోగాత్మకంగా మన్యం జిల్లాతో పాటు దేశంలోని మరో 2 జిల్లాల్లో అమలు చేయనుంది. పని జరిగే ప్రాంతంలో 10 మీటర్ల పరిధిలో అటెండెన్స్ తీసుకుంటారు. 4 గంటల వ్యవధిలో 2 సార్లు ఇలా చేయాల్సి ఉంటుంది. రెండుమూడు నెలల తర్వాత దేశమంతటా ఈ విధానం అమలయ్యే ఛాన్స్ ఉంది.


