News May 22, 2024
BJP రెబల్ ఎంపీ అభ్యర్థిపై బహిష్కరణ వేటు

భోజ్పురి సింగర్, BJP నేత పవన్ సింగ్పై ఆ పార్టీ అధిష్ఠానం బహిష్కరణ వేటు వేసింది. బిహార్లోని కరాకట్లో NDA అభ్యర్థిపై ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న కారణంతో ఈ నిర్ణయం తీసుకుంది. తొలుత అసన్సోల్లో తమ పార్టీ అభ్యర్థిగా పవన్ సింగ్ను BJP ప్రకటించింది. ఆ తర్వాత తన పాటలపై వ్యతిరేకత రావడంతో పవన్ పోటీ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత కరాకట్లో ఇండిపెండెంట్గా పోటీకి సిద్ధమయ్యారు.
Similar News
News December 5, 2025
బంగారం ధరలు మరింత పైకి: WGC

వచ్చే ఏడాది కూడా పసిడి జోరు కొనసాగవచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) అంచనా వేసింది. ప్రస్తుత స్థాయుల నుంచి 15-30% పెరగవచ్చని చెప్పింది. అమెరికా సుంకాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, బ్యాంకులు బంగారాన్ని కొంటుండటం, ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించడం వల్ల ఈ ఏడాది ఇప్పటివరకు గోల్డ్ రేట్లు 53% పెరిగాయి. అయితే US దేశ వృద్ధి అంచనాలకు మించి రాణిస్తే ధరలు 5-20% దిగి రావచ్చని WGC పేర్కొంది.
News December 5, 2025
యూరియాకు ఇవి ప్రత్యామ్నాయం

యూరియా కొరతను అధిగమించేలా ప్రస్తుతం మార్కెట్లో పంటపై పిచికారీ చేసే అనేక ఎరువులు అందుబాటులోకి వచ్చాయి. నానో యూరియా, నానో DAP, నీటిలో కలిపి పిచికారీ చేసే 19:19:19, 20:20:20, కాంప్లెక్స్ ఎరువులు, అధిక సాంద్రత కలిగిన 13-0-45(HD), ద్రవరూప నత్రజని ఎరువు వంటివి అందుబాటులో ఉన్నాయి. దుక్కిలో సిఫారసుల మేరకు కాంప్లెక్స్ ఎరువులను వేసుకొని, పైరుపై పిచికారీ చేసే ఎరువులను స్ప్రే చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.
News December 5, 2025
దీపం కొండెక్కితే..?

దీపం కొండెక్కిన తర్వాత ఉప్పును పారే జలంలో నిమజ్జనం చేయాలి. వత్తులను దాచిపెట్టుకోవాలి. ప్రమిదలను శుభ్రం చేసుకొని మళ్లీ వాడొచ్చు. నిమజ్జనం సాధ్యం కాకపోతే నీళ్లలో వేయాలి. శుక్రవారం దీపారాధన చేస్తే శనివారం ఈ పరిహారాలు పాటించాలి. ఆవుకు ఆహారం పెట్టి ప్రదక్షిణలు చేయాలి. ఈ ఉప్పు దీపాన్ని ఇంటికి ఈశాన్య దిశలో పెట్టాలి. ఇలా 11, 21 వారాలు చేస్తే శుభం కలుగుతుంది. దాచిపెట్టుకున్న వత్తులను ధూపంలో వాడుకోవచ్చు.


