News February 15, 2025

కుంభమేళా సమయం పొడిగించండి: అఖిలేశ్

image

ప్రయాగ్‌రాజ్‌కు వస్తున్న భక్తుల రద్దీ దృష్ట్యా మహాకుంభమేళాను 75 రోజులకు పొడిగించాలని SP చీఫ్ అఖిలేశ్ యాదవ్ కోరారు. గతంలో ఒకసారి కుంభమేళా 75 రోజులపాటు జరిగిందని తెలిపారు. రద్దీ దృష్ట్యా 60 సంవత్సరాల పైబడిన వారు కుంభమేళాకు రాలేకపోతున్నారన్నారు. ఇప్పటివరకూ 60కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తే 50కోట్ల మంది వచ్చినట్లు ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇస్తోందని ఎంపీ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు.

Similar News

News December 30, 2025

కొత్తగా నాటిన అరటి తోటల్లో కలుపు నివారణ ఎలా?

image

కొత్తగా నాటిన అరటి తోటల్లో కలుపు నివారణ చాలా ముఖ్యం. దీని కోసం హెక్టారుకు 500 లీటర్ల నీటిలో బుటాక్లోర్ 5L లేదా అలాక్లోర్ 2.5L లేదా పెండిమెథాలిన్ 2.5లీటర్లలో ఏదో ఒక మందును కలిపి నాటిన తర్వాత మొదటి తడి ఇచ్చి నేల తేమగా ఉన్నప్పుడు పిచికారీ చేయాలి. దీని వల్ల కలుపు మొలవకుండా అరికట్టవచ్చు. 100 మైక్రానుల మందం కలిగిన పాలిథీన్ మల్చింగ్ షీటును నేలపై పరచి ఆ తర్వాత మొక్కనాటితే కలుపు సమస్యను అధిగమించవచ్చు.

News December 30, 2025

రష్మిక-విజయ్ దేవరకొండ పెళ్లి డేట్ ఫిక్స్!

image

రష్మిక, విజయ్ దేవరకొండ కొంతకాలంగా రిలేషన్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్‌లో వీరి ఎంగేజ్‌మెంట్ జరిగిందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న ఈ సెలబ్రిటీలు పెళ్లి చేసుకోనున్నట్లు తాజాగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరగనుందని సమాచారం. కాగా దీనిపై హీరోహీరోయిన్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన లేదు.

News December 30, 2025

చర్మానికి కోకో బటర్‌

image

కోకో బటర్‌ను చాక్లెట్స్, కేక్‌ల తయారీలోనే కాకుండా చర్మాన్ని మెరిపించడానికి కూడా వాడొచ్చంటున్నారు నిపుణులు. కోకో బటర్‌లో రోజ్ వాటర్ కలిపి పడుకునే ముందు చర్మానికి అప్లై చేయాలి. మరుసటి రోజు ఉదయాన్నే చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే చర్మంపై మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. ఇందులో ఫ్యాటీ యాసిడ్‌లు ఎక్కువగా ఉండటం వల్ల చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచి, చర్మం మెరిసేలా చేస్తుంది.