News July 12, 2024
డిగ్రీ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ పొడిగింపు

AP: ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో ప్రభుత్వం మార్పులు చేసింది. అభ్యర్థుల నుంచి వచ్చిన వినతుల మేరకు రిజిస్ట్రేషన్ గడువును ఈ నెల 20 వరకు పొడిగించింది. స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్ల పరిశీలన 18 నుంచి 20వ తేదీ వరకు, కోర్సులు, కాలేజీల ఎంపికకు వెబ్ ఆప్షన్‌ల నమోదు 23-26 వరకు, 27న వెబ్ ఆప్షన్ల మార్పునకు అవకాశం కల్పించింది. 31న సీట్ల కేటాయింపు చేయనుంది.
Similar News
News February 8, 2026
ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో 169 సార్లు దలై లామా పేరు!

లైంగిక నేరగాడు <<19009352>>ఎప్‌స్టీన్ ఫైల్స్<<>>లో టిబెట్ మత గురువు దలై లామా పేరు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఏకంగా 169 సార్లు ప్రస్తావించినట్లు రిపోర్టులు రావడంతో ఆయన ఆఫీసు స్పందించింది. ‘ఎప్‌స్టీన్ ఫైల్స్‌తో దలై లామాను లింక్ చేయాలని కొన్ని మీడియా సంస్థలు, SM హ్యాండిల్స్ ప్రయత్నిస్తున్నాయి. కానీ ఎప్‌స్టీన్‌ను ఆయన ఎన్నడూ కలవలేదు. సమావేశం కాలేదు. అతడితో మాట్లాడలేదు’ అని స్పష్టంచేసింది.
News February 8, 2026
DRDOలో అప్రెంటిస్ పోస్టులు

<
News February 8, 2026
SRK ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. ‘కింగ్’ తర్వాత రెండేళ్లు సెలవు?

షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్‌కి ఇది కొంచెం షాకింగ్ న్యూసే. అప్ కమింగ్ మూవీ ‘కింగ్’ రిలీజ్ తర్వాత ఆయన రెండేళ్ల పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారట. వరుస షూటింగ్స్, స్టంట్స్ వల్ల భుజం గాయంతో పాటు ఇతర హెల్త్ ఇష్యూస్ ఇబ్బంది పెడుతుండటమే దీనికి కారణం. బాడీకి కంప్లీట్ రెస్ట్ ఇచ్చి హెల్త్ సెట్ చేసుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ‘కింగ్’ తర్వాత స్క్రీన్‌పై SRKని చూడాలంటే వెయిట్ చేయాల్సిందే.


