News September 30, 2024
Income Tax ఆడిట్ రిపోర్ట్స్ ఫైలింగ్ గడువు పొడిగింపు

2023-24 అసెస్మెంట్ ఏడాదికి వివిధ ఆడిట్ నివేదికలను సమర్పించడానికి Sep 30తో (సోమవారం) ముగియనున్న గడువును ఆదాయపు పన్ను శాఖ అక్టోబర్ 7 వరకు పొడిగించింది. వ్యాపార సంస్థలు, ఆడిట్లు చేయించుకోవాల్సిన వ్యక్తులు పన్ను నిబంధనలకు అనుగుణంగా ఈ నివేదికలను సమర్పించాలి. అక్టోబర్ 31లోపు పన్ను చెల్లించాల్సిన వారందరికీ ఈ గడువు పొడిగింపు వర్తిస్తుంది. ఈ మేరకు Central Board of Direct Taxes ప్రకటించింది.
Similar News
News December 3, 2025
పలు జిల్లాలకు వర్షసూచన

AP: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో నేడు పలు జిల్లాలకు APSDMA వర్షసూచన చేసింది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News December 3, 2025
నవ దంపతులతో సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారు?

కొత్త జీవితాన్ని ప్రారంభించబోయే నవ దంపతులు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలని అందరూ కోరుకుంటారు. అలా వర్ధిల్లాలనే వారితో సత్యనారాయణస్వామి వ్రతం చేయిస్తారు. ఈ వ్రతం ఆచరిస్తే వారి జీవితంలో సకల సంపదలు, సౌభాగ్యాలు, సత్సంతానం కలుగుతాయని స్వయంగా నారాయణుడే నారదునికి చెప్పాడని నమ్ముతారు. సత్యనారాయణ స్వామి త్రిమూర్త్యాత్మకుడైన కలియుగ దైవం కాబట్టి, ఆయన ఆశీస్సులు ముందుగా పొందడానికి ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.
News December 3, 2025
ఊట వేసిన మడి, వాత వేసిన పశువు

‘ఊట వేసిన మడి’ అంటే నీటి లభ్యత పుష్కలంగా ఉన్న పొలం (మడి). ఇది ఎప్పుడూ పచ్చగా, సమృద్ధిగా ఉంటుందని, దిగుబడి బాగా వస్తుందని అర్థం. అలాగే పూర్వకాలంలో పశువులకు (ముఖ్యంగా ఆవులు, ఎద్దులు) వ్యాధులు వచ్చినప్పుడు లేదా గాయాలు తగిలినప్పుడు ‘వాత’ వేసి చికిత్స అందించి నయం చేసేవారు. ఇలా ఊట వేసిన మడి, వాత వేసిన పశువు వల్ల రైతుకు మేలే జరుగుతుందని ఈ సామెత చెబుతుంది.


