News July 13, 2024

దోస్త్ సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు పొడిగింపు

image

TG: డిగ్రీ కాలేజీల్లో చేరేవారికి విద్యాశాఖ మరో అవకాశం కల్పించింది. ‘దోస్త్’ ద్వారా మూడు విడతల్లో సీట్లు పొంది కాలేజీల్లో స్వయంగా రిపోర్టింగ్ చేయాల్సిన గడువు నిన్నటితోనే ముగియాల్సి ఉంది. అయితే విద్యార్థుల విన్నపం మేరకు ఈ నెల 18 వరకు గడువు పెంచుతున్నట్లు కన్వీనర్, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి తెలిపారు. కాగా ఇప్పటి వరకు 1,17,057 మంది విద్యార్థులే కాలేజీల్లో రిపోర్ట్ చేశారని వెల్లడించారు.

Similar News

News November 20, 2025

HYD: 3వేల మంది అతిథులు.. 2,500 మంది పోలీసులు

image

వచ్చేనెల 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీ ప్రాంతంలోని కందుకూర్ మీర్ఖాన్‌పేటలో జరిగే గ్లోబల్ సమ్మిట్‌కు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించనున్నారు. ఈ సమ్మిట్‌కు దాదాపు 3వేల మంది వీఐపీలు, వారి అసిస్టెంట్లు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో పోలీసులు వెయ్యి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాక 2,500 మంది పోలీసులు భద్రతా చర్యల్లో పాల్గొంటున్నారు.

News November 20, 2025

సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

image

<>సత్యజిత్<<>> రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్‌‌ 14 టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 5వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్ట్, ట్రేడ్ టెస్ట్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://srfti.ac.in/

News November 20, 2025

దీక్ష తీసుకున్న సంవత్సరం, స్వామి పేరు

image

1. కన్నె స్వామి, 2. కత్తి స్వామి,
3. గంట స్వామి, 4. గద స్వామి,
5. గురుస్వామి, 6. జ్యోగి స్వామి,
7. సూర్య స్వామి, 8. చంద్ర స్వామి,
9. త్రిశూల స్వామి, 10. శంఖు స్వామి,
11. చక్ర స్వామి, 12. నాగాభరణ స్వామి,
13. శ్రీహరి స్వామి, 14. పద్మ స్వామి,
15. శ్రీ స్వామి, 16. శబరిగిరి స్వామి,
17. ఓంకార స్వామి, 18. నారికేళ స్వామి.