News July 5, 2024

కవిత జుడీషియల్ రిమాండ్‌ పొడిగింపు

image

ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ రిమాండ్‌ను రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. సీబీఐ కేసులో ఈనెల 18 వరకు రిమాండ్‌ను పొడిగించింది.

Similar News

News July 8, 2024

పిల్లలు ఎవరితో చాట్ చేస్తున్నారో చెక్ చేయండి: పోలీసులు

image

TG: మొబైల్ ఫోన్ వాడకంతో పిల్లలు తప్పుదారి పడుతున్నారని, 9వ తరగతి పిల్లల ప్రవర్తనను పేరెంట్స్ ఎప్పటికప్పుడు గమనిస్తుండాలని పోలీసులు సూచించారు. ‘పిల్లలు ఎదుగుతున్నారంటే వారికి చెడు దారులు సైతం ఎదురవుతాయి. మంచి- చెడు మధ్య తేడా తెలియని వారినే డ్రగ్స్ మాఫియా టార్గెట్ చేస్తోంది. ఎవరితో చాట్ చేస్తున్నారో చెక్ చేయండి. అప్రమత్తంగా ఉండటం మన బాధ్యత’ అని పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.
>>SHARE IT

News July 8, 2024

డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు

image

తెలంగాణను మాదకద్రవ్య రహితంగా తీర్చిదిద్దేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. నిన్న రాత్రి HYD జూబ్లీహిల్స్ పరిధిలోని పబ్స్, బార్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. యువత దగ్గర డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాలు ఉన్నాయా? అని చెక్ చేశారు. పబ్స్‌లో వీటి వాడకాన్ని యజమానులు ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రగ్స్ వాడకాన్ని గుర్తిస్తే వెంటనే డయల్ 100కి కాల్ చేయాలని సూచించారు.

News July 8, 2024

మన దేశంలో క్రికెట్ ఒకటే ఆటనా?

image

మన దేశంలో క్రికెట్‌కు ఉన్న విపరీతమైన క్రేజ్‌తో మిగతా క్రీడలకు ఆదరణ లభించట్లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. టీ20 WC గెలిచిన టీమ్ ఇండియాకు బీసీసీఐ రూ.120 కోట్ల భారీ బహుమతి ఇచ్చింది. అంతేగాక రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైజ్ మనీ అందిస్తున్నాయి. అంగరంగ వైభవంగా విజయయాత్ర నిర్వహించారు. టెన్నిస్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ లాంటి ఎన్నో ఆటలను ప్రోత్సహిస్తే బాగుంటుందన్నది పలువురి అభిప్రాయం. దీనిపై మీ కామెంట్?