News July 3, 2024

కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు

image

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు జులై 12 వరకు పొడిగించింది. లిక్కర్ స్కాంకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ధర్మాసనం ఈమేరకు ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు జులై 5న విచారించనుంది. కాగా కొన్ని నెలలుగా కేజ్రీవాల్ తిహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

Similar News

News March 31, 2026

ఇండిగో కొత్త సీఈవోగా విలియం వాల్ష్

image

భారత్‌లో అతిపెద్ద ఎయిర్‌లైన్స్ ఇండిగోకు కొత్త CEOగా విలియం వాల్ష్ నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం IATA(ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్) డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్నారు. గతంలో ఈయన బ్రిటిష్ ఎయిర్‌వేస్ తదితర సంస్థల్లో పనిచేశారు. విలియం నాయకత్వంలో ఎయిర్‌లైన్స్ మరింత అభివృద్ధి చెందుతుందని ఇండిగో ఛైర్మన్ విక్రమ్ సింగ్ అన్నారు. ఇటీవల ఇండిగో CEO పదవికి పీటర్ ఎల్బర్స్ రిజైన్ చేసిన విషయం తెలిసిందే.

News March 31, 2026

పీరియడ్స్ వాయిదాకు పిల్స్ వాడుతున్నారా?

image

పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పండుగల్లో ఇబ్బంది పడకుండా మహిళలు పీరియడ్స్‌‌ను తాత్కాలికంగా వాయిదా వేసే మాత్రలను వాడటం పెరిగింది. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘వీటిని తరచూ వేసుకొంటే హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడుతుంది. నెలసరి క్రమం తప్పుతుంది. తలనొప్పి, వికారం, రొమ్ములో గడ్డలు, బరువు పెరగడం వంటి సమస్యలు వస్తాయి. కొందరికి హార్ట్ అటాక్‌ ముప్పూ ఉంటుంది’ అని చెబుతున్నారు.
#ShareIt

News March 31, 2026

BREAKING: తగ్గిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఉదయం <<19521864>>పెరిగిన<<>> బంగారం ధరలు సాయంత్రానికి తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై 600 తగ్గి రూ.1,48,690, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.550 తగ్గి రూ.1,36,300 పలుకుతోంది. అటు కిలో వెండి రూ.2,50,000 వద్ద కొనసాగుతోంది.