News August 27, 2024
కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. సెప్టెంబర్ 3 వరకు పొడిగిస్తూ మంగళవారం ఆదేశాలిచ్చింది. కేజ్రీవాల్తో పాటు మరో ఐదుగురిని నిందితులుగా పేర్కొంటూ సీబీఐ దాఖలు చేసిన నాలుగో అనుబంధ చార్జిషీట్పైనా కోర్టు తన నిర్ణయాన్నిరిజర్వ్లో ఉంచింది. దీనిపై కూడా సెప్టెంబర్ 3న విచారణ జరపనుంది.
Similar News
News December 3, 2025
అది కాళేశ్వరం కాదు.. కూలేశ్వరం: సీఎం రేవంత్ రెడ్డి

కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని సీఎం రేవంత్ రెడ్డి ఏద్దేవా చేశారు. బుధవారం హుస్నాబాద్ ప్రజా పాలన సభలో మాట్లాడుతూ లక్ష కోట్లు ఖర్చు పెట్టి కూలిపోయే ప్రాజెక్ట్ కట్టారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులతోనే నేటికీ తెలంగాణ ప్రజలకు నీటిని అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో కట్టిన ప్రాజెక్ట్ వైఫల్యమైందని విమర్శించారు.
News December 3, 2025
మార్క్రమ్ సెంచరీ.. ఔట్ చేసిన హర్షిత్

భారత్ నిర్దేశించిన 359 పరుగుల భారీ లక్ష్యం వైపు సాగుతున్న సౌతాఫ్రికాను హర్షిత్ రాణా దెబ్బ కొట్టారు. తొలి వన్డే ఆదిలోనే వికెట్లు తీసిన అతడు తాజాగా సెంచరీతో చెలరేగిన మార్క్రమ్ను వెనక్కి పంపారు. 110 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అతడిని పెవిలియన్ చేర్చారు. అంతకుముందు బవుమా 46, డీకాక్ 8 రన్స్ చేసి ఔట్ అయ్యారు. RSA 30 ఓవర్లలో 197/3 చేసింది. అర్ష్దీప్, ప్రసిద్ధ్, హర్షిత్ తలో వికెట్ తీశారు.
News December 3, 2025
ఏపీ న్యూస్ రౌండప్

⋆ రేపు తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఉ.11 గంటలకు YS జగన్ ప్రెస్ మీట్
⋆ శ్రీశైలంలో ఈ నెల 7 వరకు సాధారణ భక్తులకు స్పర్శ దర్శనం రద్దు.. ఇరుముడి కలిగిన శివస్వాములకు మాత్రమే ఉచిత స్పర్శ దర్శనం
⋆ వైఎస్ వివేకా హత్య కేసులో సమగ్ర దర్యాప్తు జరపాలని సునీత వేసిన పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసిన CBI కోర్టు.. ఈ నెల 10న తీర్పు
⋆ ఈ నెల 23న ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికలు


