News July 23, 2024
మెడికల్ రీయింబర్స్మెంట్ పథకం పొడిగింపు

AP: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మెడికల్ రీయింబర్స్మెంట్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించింది. 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 వరకు ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (EHS)కు సమాంతరంగా మెడికల్ రీయింబర్స్మెంట్ పథకం అమలులో ఉంటుందని వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి కృష్ణబాబు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Similar News
News December 8, 2025
మూవీ ముచ్చట్లు

✦ ఈ నెల 12నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్న దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘కాంత’
✦ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్ నివేదా థామస్ సోదరుడు.. ‘బెంగళూరు మహానగరంలో బాలక’ సినిమాతో హీరోగా ఎంట్రీ.. పోస్టర్ రిలీజ్ చేసిన మూవీ యూనిట్
✦ ఈ నెల 19న థియేటర్లలో రిలీజ్ కానున్న అగస్త్య నరేశ్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న ‘గుర్రం పాపిరెడ్డి’
News December 8, 2025
INDIGO… NAIDU MUST GO: అంబటి

AP: ఇండిగో సంక్షోభాన్ని ముందుగా కనిపెట్టడంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విఫలమయ్యారని YCP నేత అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. ‘INDIGO… NAIDU MUST GO!’ అంటూ రామ్మోహన్ పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. అంతకుముందు రామ్మోహన్ తెలుగువారి పరువు తీశారని మాజీ మంత్రి అమర్నాథ్ విమర్శించిన సంగతి తెలిసిందే. కాగా సుమారు 5వేల విమాన సర్వీసులు రద్దవ్వగా 8లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
News December 8, 2025
‘నీ భార్యను ఇండియాకు పంపేయ్’.. JD వాన్స్పై నెటిజన్ల ఫైర్

వలసలపై US ఉపాధ్యక్షుడు JD వాన్స్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సామూహిక వలసలు అమెరికా కలను దొంగతనం చేయడమేనని ఆయన ట్వీట్ చేశారు. దీంతో ఇది విదేశీయులపై ద్వేషమేనని నెటిజన్లు ఫైరవుతున్నారు. ‘మీ భార్య ఉష, ఆమె ఫ్యామిలీ, మీ పిల్లలను ఇండియాకు పంపేయండి’ అని మండిపడుతున్నారు. హిందువైన తన భార్య <<18155411>>క్రైస్తవం<<>>లోకి మారే ఛాన్స్ ఉందని ఇటీవల వాన్స్ చేసిన కామెంట్లు దుమారం రేపాయి.


