News April 21, 2024
పోస్టల్ బ్యాలట్ దరఖాస్తు గడువు పొడిగింపు

AP: రాష్ట్రంలో పోస్టల్ బ్యాలట్ దరఖాస్తుల సమర్పణ గడువును ఈ నెల 26 వరకు పొడిగించినట్లు సీఈవో ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. ఉద్యోగులు ఎక్కడ ఉన్నా పనిచేసే చోటే ఫాం-12 ఇవ్వవచ్చని స్పష్టం చేశారు. వారందరూ ఓటు వేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Similar News
News February 4, 2026
వనపర్తి: ఇంటర్ ప్రయోగ పరీక్షలో 126 మంది గైర్హాజరు

వనపర్తి జిల్లాలో బుధవారం జరిగిన ఇంటర్ ప్రయోగ పరీక్షలకు మొత్తం 126 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు వనపర్తి డిఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. ఉదయం జరిగిన జనరల్ ఒకేషనల్ ప్రాక్టికల్స్‌లో 1767 మంది విద్యార్థులకు 1697 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. అదేవిధంగా మధ్యాహ్నం జరిగిన ప్రాక్టికల్స్‌లో 1569 మంది విద్యార్థులకు 1513 మంది పరీక్షలకు హాజరైనట్లు డీఐఈఓ తెలిపారు.
News February 4, 2026
పదిలమైన ఇంటికి పంచ సూత్రాలు

ఇల్లు పదిలంగా ఉండేందుకు వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు ‘పంచసూత్రాలు’ సూచిస్తున్నారు. అవి 1. సరైన వాస్తుతో స్థలం ఎంపిక, 2. పనుల నిర్వహణకు పక్కా ప్లానింగ్, 3. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే బలమైన స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, 4. అవసరాలకు అనుగుణంగా వస్తువుల అమరిక తెలిపే ఇంటీరియర్ డిజైన్, 5. ఇంటి అందాన్ని పెంచే ఇంటీరియర్ డెకరేషన్. ఈ 5 అంశాల మేళవింపుతోనే ఇల్లు సేఫ్, అందంగా ఉంటుందని ఆయన అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News February 4, 2026
పవన్‌ను కలిసిన రాజేంద్ర ప్రసాద్

AP: రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇవాళ మంగళగిరి క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాజేంద్ర ప్రసాద్‌కు పద్మశ్రీ అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. రాజేంద్ర ప్రసాద్‌ను పవన్ అభినందించారు.


