News July 31, 2024
కవితకు రిమాండ్ పొడిగింపు

TG: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రౌస్ అవెన్యూ కోర్టు రిమాండ్ పొడిగించింది. ఆగస్టు 13 వరకు ఆమెకు జుడీషియల్ రిమాండ్ పొడిగిస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. కవితతోపాటు మిగతా నిందితులను అధికారులు వర్చువల్‌గా కోర్టులో హాజరుపరిచారు.
Similar News
News March 4, 2026
వార్ ఎఫెక్ట్.. ‘టాక్సిక్’ రిలీజ్ వాయిదా

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ‘టాక్సిక్’ సినిమా విడుదల వాయిదా పడింది. ఈనెల 19న రావాల్సిన ఈ చిత్రాన్ని మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల దృష్ట్యా వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. ‘టాక్సిక్’ ప్రపంచవ్యాప్తంగా జూన్ 4న విడుదల అవుతుందని ప్రకటించింది. ఇంగ్లిష్‌తో పాటు భారతీయ భాషల్లో విడుదల కానున్నట్లు తెలిపింది.
News March 4, 2026
ఇండియా కంటే ఇంగ్లండ్ స్పిన్ మెరుగ్గా ఉంది: మైఖేల్ వాన్

T20 WC: భారత్‌తో జరగనున్న సెమీఫైనల్లో ఇంగ్లండ్‌దే పైచేయి అని ఆ దేశ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ జోస్యం చెప్పారు. ఇంగ్లండ్ వద్దే మెరుగైన స్పిన్ అటాక్ ఉందని అభిప్రాయపడ్డారు. ఆదిల్ రషీద్, లియామ్ డాసన్, విల్ జాక్స్ ఈ టోర్నీలో బెస్ట్ ఇచ్చారని కొనియాడారు. టీమ్‌ఇండియా X-ఫ్యాక్టర్ వరుణ్ చక్రవర్తిని ప్రత్యర్థి బ్యాటర్లు ఈజీగా ఎదుర్కొంటున్నారని, ఫీల్డింగ్‌లోనూ భారత్ వెనకబడి ఉందని విమర్శించారు.
News March 4, 2026
ఆనాటి ‘రంగుల’ లోకాన్ని మిస్ అవుతున్నారా?

పురోహితుల సూచనతో చాలా ప్రాంతాల్లో హోలీ పండుగను ఇవాళే జరుపుకుంటున్నారు. అయితే చాలాచోట్ల ఒకప్పటి సందడి కనిపించట్లేదు. ముఖ్యంగా పట్టణాల్లో పిల్లలు, పెద్దలూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. అదే ఒకప్పుడు ఫ్రెండ్స్‌తో ఊరంతా తిరిగి ఎంజాయ్ చేసేవాళ్లు. ఒళ్లంతా రంగులు పూసుకున్నా మనసు నిండా స్వచ్ఛమైన ఆనందం ఉండేది. ఏ టెన్షన్ లేకుండా నవ్వుతూ గడిపిన ఆ రోజులు మళ్లీ రావు. మీరూ ఒకప్పటి హోలీని మిస్ అవుతున్నారా? COMMENT


