News April 20, 2024
16,024 మంది సిబ్బంది సేవలు పొడిగింపు

TG: వైద్య విద్య డైరెక్టర్(డీఎంఈ) పరిధిలోని వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో పనిచేసే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి శుభవార్త. గౌరవవేతనంతో విధులు నిర్వహిస్తున్న 16,024 మంది సేవలను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. డీఎంఈ పరిధిలోని పలు విభాగాల్లో సర్వీసులను ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు పొడిగించింది. ఈమేరకు ఆర్థిక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Similar News
News March 3, 2026
రానున్న 4 రోజులు జాగ్రత్త!

TG: రాష్ట్రంలో రానున్న 4 రోజులు టెంపరేచర్ 2-3 డిగ్రీలు పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్, కొత్తగూడెం, భూపాలపల్లి, గద్వాల, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణ్ పేట, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో 36°C-40°C వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పింది. మిగతా జిల్లాల్లో 36°C కంటే టెంపరేచర్ తక్కువగా నమోదైనా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
News March 3, 2026
లెబనాన్‌లోకి ఇజ్రాయెల్ సైన్యం

పశ్చిమాసియాలో యుద్ధం మరో స్థాయికి చేరింది. ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ లెబనాన్‌లోకి ప్రవేశించి సరిహద్దు వెంట వ్యూహాత్మక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. ఉత్తర ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా దాడులను అడ్డుకోవడానికి ‘సెక్యూరిటీ జోన్’ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ‘ఆపరేషన్ రోరింగ్ లయన్’ చేపట్టింది. దీనికి ప్రతిచర్యగా హెజ్బొల్లా కూడా ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై డ్రోన్లు, రాకెట్లతో విరుచుకుపడుతోంది.
News March 3, 2026
9 మంది రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన BJP

9 మంది రాజ్యసభ అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. పార్టీ కొత్త అధ్యక్షుడు నితిన్ నబీన్, శివేశ్ కుమార్ బిహార్ నుంచి ఎంపిక కానున్నారు. అస్సాం నుంచి తెరాశ్ గోవల్ల, జోగెన్ మోహన్, ఛత్తీస్‌గఢ్ నుంచి లక్ష్మీ వర్మ, హరియాణా నుంచి సంజయ్ భాటియా, ఒడిశా నుంచి మన్మోహన్ సమాల్, సుజీత్ కుమార్, బెంగాల్ నుంచి రాహుల్ సిన్హాను సెలక్ట్ చేసింది. ఈ నెల 16న ఎన్నికలు జరగనున్నాయి.


