News April 10, 2024
టెట్ దరఖాస్తు గడువు పెంపు

TG: టెట్ దరఖాస్తు గడువును ప్రభుత్వం పెంచింది. షెడ్యూల్ ప్రకారం నేటితో గడువు ముగుస్తుండగా ఈనెల 20 వరకు పొడిగించింది. అలాగే 11 నుంచి 20 వరకు అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ అవకాశాన్ని కల్పించింది. కాగా నిన్నటి వరకు 1.93 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. గతంతో పోలిస్తే ఈసారి అప్లికేషన్ల సంఖ్య భారీగా తగ్గింది. మే 20 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు జరగనున్నాయి.
Similar News
News December 19, 2025
విజయ్ హజారే ట్రోఫీలో ఆడనున్న విరాట్, రోహిత్

భారత స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ఆడనున్నారు. విరాట్ కోహ్లీ, పంత్, ఇషాంత్ శర్మ, నవదీప్ సైనీ తమ జట్టు తరఫున ఆడతారని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అధికారికంగా ప్రకటించింది. అటు ఈ టోర్నమెంట్లో తొలి రెండు మ్యాచుల్లో రోహిత్ శర్మ ఆడనున్నారని ముంబై క్రికెట్ అసోసియేషన్ అధికారి ఒకరు వెల్లడించారు. డిసెంబర్ 24 నుంచి ఈ టోర్నమెంట్ ప్రారంభం కానుంది.
News December 19, 2025
₹7,910 కోట్ల ప్రాజెక్టుకు ‘అమరజీవి జలధార’గా పేరు

AP: పొట్టి శ్రీరాములు పేరు చిరస్థాయిగా గుర్తుండేలా రాష్ట్రంలో ₹7,910 కోట్లతో చేపట్టే మంచినీటి సరఫరా ప్రాజెక్టుకు ‘అమరజీవి జలధార’గా ప్రభుత్వం నామకరణం చేసింది. రానున్న 30 ఏళ్ల నాటికి 5 ఉమ్మడి జిల్లాల పరిథిలో 1.21 కోట్లమంది దాహార్తిని ఈ ప్రాజెక్టు తీర్చనుంది. ఉమ్మడి ప్రకాశం, చిత్తూరు, పల్నాడు, ఉభయ గోదావరి జిల్లాలకు ఈ స్కీమ్ ద్వారా మంచినీరు సరఫరా అవుతుంది. జలధార పోస్టర్ను Dy CM పవన్ ఆవిష్కరించారు.
News December 19, 2025
ఎల్లుండి నుంచి అకౌంట్లలోకి బోనస్ డబ్బులు

TG: రాష్ట్రంలో వరి సన్నాలు సాగు చేసిన రైతులకు బోనస్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 24 లక్షల మంది రైతులకు బోనస్ కింద రూ.649 కోట్లు చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. దీంతో సోమవారం నుంచి చెల్లింపులు మొదలవుతాయని అధికారులు చెబుతున్నారు. కాగా సన్నాలకు క్వింటాకు రూ.500 చొప్పున అదనంగా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.


