News October 17, 2024

‘విదేశీ విద్యానిధి’ గడువు పెంపు

image

TG: విదేశీ విద్యానిధి పథకం ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు తేదీని పెంచినట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు పెరిక యాదయ్య తెలిపారు. ఈ నెల 29 వరకు గడువు పొడిగించినట్లు వెల్లడించారు. అర్హులైన ఎస్సీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. మరిన్ని వివరాలకు https://telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

Similar News

News January 24, 2026

పశువులకు మేతగా ఉల్లిపాయలతో డేంజర్

image

ఉల్లికి సరైన ధర లేకపోతే కొందరు రైతులు ఆ పొలాలను గొర్రెలు, మేకలు, పశువులకు మేతగా వదిలేస్తున్నారు. కానీ ఇలా చేయడం ప్రమాదకరమని వెటర్నరీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉల్లిపాయల్లో ఉండే N-propyl disulfide అనే రసాయనం పశువుల్లోని ఎర్రరక్తకణాలను విడదీస్తుందని తెలిపారు. దీనివల్ల వాటిలో బలహీనత, కళ్లు, మూత్రం ఎర్రగా మారడం, శ్వాసలో వేగం పెరగడం, కడుపులో వాపు, లక్షణాలు తీవ్రమైతే అవి మరణించే అవకాశం ఉందంటున్నారు.

News January 24, 2026

కాటన్ యూనివర్సిటీలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

గువాహటిలోని <>కాటన్ <<>>యూనివర్సిటీ 9 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తోంది. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఫిబ్రవరి 2 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీ, డాక్యుమెంట్స్‌ను ఫిబ్రవరి 9 వరకు పోస్ట్ చేయాలి. దరఖాస్తు ఫీజు రూ.1000, SC,STలకు రూ.500. వెబ్‌సైట్: https://cottonuniversity.ac.in/

News January 24, 2026

రాత్రికి రాత్రే బ్రిడ్జిని మాయం చేశారు!

image

70 అడుగుల పొడవైన స్టీల్ బ్రిడ్జిని రాత్రికి రాత్రే దొంగలు ఎత్తుకెళ్లారు. పొద్దున లేచి చూసేసరికి అది కనిపించకపోవడంతో ఆశ్చర్యపోవడం స్థానికుల వంతైంది. ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బాలో జరిగిందీ ఘటన. హస్‌దేవ్ లెఫ్ట్ కెనాల్‌పై 40ఏళ్ల కిందట బ్రిడ్జి నిర్మించారు. దాని బరువు 10 టన్నులపైనే ఉంటుంది. 15మంది కలిసి బ్రిడ్జిని కట్ చేసి, తుక్కు కింద అమ్మారని పోలీసులు తెలిపారు. వీరిలో ఐదుగురిని అరెస్టు చేశామని చెప్పారు.