News March 18, 2025
హైడ్రా పేరుతో వసూళ్ల దందా: కేటీఆర్

TG: హైడ్రా పేరుతో వసూళ్ల దందా నడుస్తోందని కేటీఆర్ ట్వీట్ చేశారు. మూసీ పేరుతో పేదల ఇళ్లపై పగబట్టారని ఓ న్యూస్ ఆర్టికల్ను షేర్ చేశారు. ఫోర్త్ సిటీ పేరుతో సీఎం కుటుంబం రియల్ వ్యాపారం చేస్తోందని విమర్శలు చేశారు. పేదలపై ప్రతాపం చూపిస్తూ పెద్దలతో ఒప్పందం చేసుకుంటారని దుయ్యబట్టారు. 15 నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రాన్ని పాతాళానికి తీసుకెళ్లారన్నారు. ఇప్పటికైనా ప్రజలు మేల్కోవాలన్నారు.
Similar News
News March 18, 2025
నేటి నుంచే అంగన్వాడీల్లో ఒంటి పూట: మంత్రి

AP: ఎండల తీవ్రత నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో నేటి నుంచే ఒంటి పూట అమల్లోకి తీసుకొచ్చారు. ఉదయం 8 నుంచి 12 వరకు పిల్లలకు ప్రీ స్కూల్ నిర్వహించాలని మంత్రి సంధ్యారాణి ఆదేశించారు. పిల్లలకు మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
News March 18, 2025
మంచు లక్ష్మి, కాజల్, రానాపై కేసుకు డిమాండ్!

టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చొరవతో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తోన్న యూట్యూబర్లు, సెలబ్రిటీలపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. నిన్న కూడా 11 మందిపై కేసు నమోదైంది. అయితే, మంచు లక్ష్మి సైతం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని విమర్శలొస్తున్నాయి. బెట్టింగ్ యాప్ యాడ్స్లో నటించిన రానా, కాజల్, ప్రకాశ్రాజ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
News March 18, 2025
సెలబ్రిటీలపై కేసు.. పోలీసుల కీలక ఆదేశాలు

TG: సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్లపై పంజాగుట్ట పోలీసులు చర్యలు వేగవంతం చేశారు. నిన్న కేసు నమోదైన 11 మంది సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లను ఇవాళ సాయంత్రంలోగా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. నోటీసులు ఇచ్చిన వారిలో విష్ణుప్రియ, సుప్రిత, రీతూ చౌదరి, హర్షసాయి, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, శ్యామల, కిరణ్ గౌడ్, సన్నీ యాదవ్, సుధీర్ రాజు, అజయ్ ఉన్నారు.