News August 16, 2025

బ్రెవిస్‌కు ఎక్స్‌ట్రా పేమెంట్.. CSK క్లారిటీ

image

IPL-2025లో ఆడేందుకు <<17405212>>బ్రెవిస్‌కు<<>> ఎక్స్‌ట్రా పేమెంట్ ఇచ్చారన్న మాజీ క్రికెటర్ అశ్విన్ వ్యాఖ్యలపై CSK స్పందించింది. ‘టోర్నీ నియమాలకు లోబడే గాయపడిన గుర్జప్నీత్ సింగ్ స్థానంలో బ్రెవిస్‌ను తీసుకున్నాం. రూల్ ప్రకారం రీప్లేస్‌మెంట్ ప్లేయర్‌కు ఇంజూర్డ్ ప్లేయర్‌కు ఇవ్వాల్సిన ఫీ కంటే ఎక్కువ ఇవ్వొద్దు. దాని ప్రకారమే వేలంలో గుర్జప్నీత్‌ను కొన్న ధరనే (₹2.2Cr) బ్రెవిస్‌కు చెల్లించాం’ అని స్పష్టం చేసింది.

Similar News

News August 17, 2025

మనకు, చైనాకు తేడా ఇదే!

image

ఏదైనా వస్తువును విదేశాలకు ఎగుమతి చేయాలంటే ఇండియాలో సవాలక్ష సవాళ్లు ఎదురవుతాయని పలువురు వ్యాపారవేత్తలు చెబుతున్నారు. చైనాలో ఒక కంటైనర్ ఫ్యాక్టరీ నుంచి పోర్టుకు వెళ్లాలంటే ఇన్వాయిస్, ప్యాకేజీ లిస్ట్ ఉంటే చాలంటున్నారు. అదే మన దేశంలో ట్యాక్స్ ఇన్వాయిస్, కమర్షియల్ ఇన్వాయిస్, ఈ-వే బిల్లు, ఇన్సూరెన్స్ పేపర్లు.. ఇలా 17-18 డాక్యుమెంట్లు అవసరం అని చెబుతున్నారు. దీనివల్ల ఎంతో టైమ్ వృథా అవుతోందంటున్నారు.

News August 17, 2025

ఫ్రీ బస్ స్కీమ్.. ఆధార్ జిరాక్స్, సాఫ్ట్ కాపీలకు అనుమతి?

image

AP: ‘స్త్రీ శక్తి’ స్కీమ్ అమలులో భాగంగా RTC బస్సుల్లో ఆధార్ జిరాక్స్, సెల్‌ఫోన్‌లో సాఫ్ట్ కాపీని అనుమతించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. పథకం అమలు తీరుపై CM చంద్రబాబు సమీక్షించారు. ఘాట్ రోడ్లలోనూ ఉచిత ప్రయాణానికి అనుమతించాలని అధికారులను ఆదేశించారు. గడచిన 30 గంటల్లో 12 లక్షల మందికి పైగా మహిళలు ఉచితంగా ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు. ఎల్లుండి నుంచి రద్దీ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

News August 16, 2025

టాలీవుడ్ పంచాయితీ: మెగాస్టార్ ఫుల్ స్టాప్ పెట్టేనా?

image

సినీ కార్మికుల వేతన పెంపు పంచాయితీ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి చేరింది. సమస్యలపై చర్చించేందుకు నిర్మాతలు, ఫెడరేషన్ నాయకులు రేపు చిరు ఇంట్లో సమావేశం కానున్నారు. ఇరువర్గాల మధ్య చిరు సయోధ్య కుదుర్చుతారో లేదో అనేది ఆసక్తికరంగా మారింది. 30 శాతం వేతనాలు పెంచాలని కార్మికులు పట్టుబడుతుండగా షరతులతో కూడిన పెంపునకు నిర్మాతలు ప్రతిపాదనలు చేసిన సంగతి తెలిసిందే.