News November 13, 2024

తెలంగాణలో చలి తీవ్రత

image

TG: రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో చలి తీవ్రత పెరిగింది. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు చల్లటి గాలులు వీస్తున్నాయి. నిన్న మెదక్‌లో అత్యల్పంగా 14.2°C ఉష్ణోగ్రత నమోదైంది. పగటి ఉష్ణోగ్రతలు సైతం చాలా జిల్లాల్లో సాధారణం కంటే తక్కువగా ఉంటున్నాయి. మరోవైపు నేడు, రేపు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది.

Similar News

News November 14, 2024

రైతన్నలకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం

image

TG: పంట పొలాల్లో సోలార్ పవర్ సృష్టికి ప్రభుత్వం సిద్ధమైంది. మార్చిలోగా 4 వేల మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతి ఇస్తూ ‘పీఎం కుసుమ్’ అమలుకు ఆదేశాలు జారీ చేసింది. దీని ద్వారా పంటలకు తోడుగా విద్యుత్ ఉత్పత్తితోనూ రైతులు ఆదాయం పొందవచ్చు. ఇందుకోసం రైతులు సొంతంగా లేదా ఏదైనా సహకార, స్వయం సహాయక సంఘం లేదా కంపెనీ భాగస్వామ్యంతో పొలంలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.

News November 14, 2024

భారీ జీతంతో GAILలో ప్రభుత్వ ఉద్యోగాలు

image

గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా(GAIL)లో 261 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. వచ్చే నెల 12 వరకు అప్లై చేసుకోవచ్చు. ఉద్యోగాన్ని బట్టి బీఏ, బీకాం, BSC LLB, MSC, PG <>ఉత్తీర్ణులైనవారు<<>> అర్హులు. గ్రూప్ డిస్కషన్, ఫిజికల్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. సీనియర్ ఇంజినీర్/ఆఫీసర్‌కు రూ.60,000-1,80,000, జూ.ఆఫీసర్‌కు రూ.50,000-1,60,000 జీతం ఉంటుంది.
వెబ్‌సైట్‌: https://gailonline.com/

News November 14, 2024

తెలంగాణలో రాష్ట్రపతి పర్యటన ఖరారు

image

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నెల 21, 22 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 21న హకీంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి NTR స్టేడియంలో జరిగే కోటి దీపోత్సవానికి హాజరవుతారు. 22న హైటెక్ సిటీలోని శిల్పకళావేదికలో లోక్‌మంతన్-2024 కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్రపతి పర్యటనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సీఎస్ శాంతి కుమారి అధికారులను ఆదేశించారు.