News September 30, 2024

తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత

image

TG: బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైడ్రాపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందంటూ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్‌ వద్దకు చేరుకున్నాయి. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి పరస్పరం దాడి చేసుకున్నాయి. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెస్తున్నారు.

Similar News

News September 30, 2024

సీఎం సోదరుడి ఇల్లు ఎందుకు కూల్చడంలేదు: KTR

image

TG: ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న CM రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇంటిని ఎందుకు కూల్చడం లేదని మాజీ మంత్రి KTR ప్రశ్నించారు. ‘40-50 ఏళ్ల కిందట కట్టుకున్న పేదల ఇళ్లను పడగొడతామంటే నీ అయ్య జాగీర్ కాదని గుర్తుచేస్తున్నా. HYDలో రియల్ ఎస్టేట్ రంగాన్ని మొత్తం పడగొట్టారు. కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు భయపడుతున్నారు. రిజిస్ట్రేషన్ ఆదాయం రూ.1150 కోట్ల నుంచి రూ.750 కోట్లకు పడిపోయింది’ అని KTR తెలిపారు.

News September 30, 2024

బుల్డోజర్లకు అడ్డుగా నిలబడతాం: KTR

image

TG: ‘హైడ్రా’ పేరుతో ప్రభుత్వం అమాయక ప్రజల ఇళ్లు కూలుస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. ‘ఎవరి కమీషన్ల కోసం మూసీ సుందరీకరణ అంటున్నారు. పేదల ఇళ్లు కూలుస్తుంటే మేం చూస్తూ ఊరుకోం. బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది. నాతో సహా మా నేతలంతా బుల్డోజర్లకు అడ్డుగా నిలబడతాం. కూల్చాల్సి వస్తే మొదట హైడ్రా కమిషన్ కార్యాలయం, బుద్ధభవన్‌ను కూల్చాలి’ అని కేటీఆర్ మండిపడ్డారు.

News September 30, 2024

చరిత్ర సృష్టించిన బుమ్రా

image

బంగ్లాదేశ్‌తో జరుగుతోన్న రెండో టెస్టు మ్యాచులో టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించారు. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో 50 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా బుమ్రా నిలిచారు. దీంతో పాటు జేమ్స్ అండర్సన్‌ను అధిగమించి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్(WTC)లో అత్యధిక వికెట్లు తీసిన ఏడవ బౌలర్‌గా బుమ్రా రికార్డులకెక్కారు.