News September 6, 2024
85శాతం జిల్లాల్లో విపరీత వాతావరణ పరిస్థితులు: అధ్యయనం

దేశవ్యాప్తంగా 85శాతం జిల్లాల్లో విపరీత వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని ఐపీఈ గ్లోబల్, ఇస్రీ ఇండియా చేసిన సంయుక్త అధ్యయనంలో వెల్లడైంది. సంప్రదాయ వరద ప్రభావిత ప్రాంతాలు కరవుతో, సంప్రదాయ కరవు ప్రాంతాలు వరదలతో అల్లాడుతున్నాయని ఆ నివేదిక తెలిపింది. 1973 నుంచి 2023 మధ్యకాలంలో వాతావరణ పరిస్థితుల వివరాలను అధ్యయనం చేసిన మీదట గత దశాబ్దకాలంలో వాతావరణంలో విపరీత మార్పులు ఐదింతలు పెరిగాయని వెల్లడించింది.
Similar News
News December 4, 2025
WGL: పెరిగిన వండర్ హట్, తగ్గిన తేజా మిర్చి ధరలు

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో గురువారం ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి. వండర్ హాట్(WH) మిర్చి క్వింటాకు బుధవారం రూ.19 వేలు ధర రాగా, ఈరోజు రూ.19,300 అయింది. 341 రకం మిర్చికి నిన్న రూ.16,500 ధర రాగా, నేడు కూడా అదే దర వచ్చింది. అలాగే తేజ మిర్చి బుధవారం రూ.14,200 పలకగా, ఈరోజు కూడా అదే ధర వచ్చింది. కొత్త తేజ మిర్చి నిన్న రూ.14,800 ధర వస్తే నేడు రూ.14,200కి పడిపోయింది.
News December 4, 2025
ఇంటర్వ్యూతో ICSILలో ఉద్యోగాలు

ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్(<
News December 4, 2025
పెప్లమ్ బ్లౌజ్‌ని ఇలా స్టైల్ చేసేయండి

సాధారణంగా పెప్లమ్ టాప్స్ జీన్స్‌పైకి సూట్ అవుతాయి. కానీ దీన్ని ఎత్నిక్ వేర్‌గా ట్రై చేస్తే మోడ్రన్ టచ్ ఇస్తుంది. పెప్లమ్ టాప్స్‌ను చీరలతో స్టైల్ చేసి ట్రెండీ లుక్ సొంతం చేసుకోవచ్చు. పార్టీల్లో, ఫంక్షన్లలో అందరి దృష్టిని ఆకర్షించాలంటే, జాకెట్ స్టైల్ పెప్లమ్ బ్లౌజ్‌తో చీరను మ్యాచ్ చేస్తే సరిపోతుంది. పెప్లమ్ బ్లౌజ్ వేసుకుంటే పల్లు లోపలికి తీసుకుంటారు. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.


