News September 25, 2024

అనుమతులు లేకుండానే నడుస్తోన్న EY కంపెనీ

image

పని ఒత్తిడితో <<14129191>>చనిపోయిన<<>> యువ సీఏ అన్నా సెబాస్టియన్ పనిచేసిన పుణేలోని EY కార్యాలయానికి పర్మిషనే లేదని విచారణలో తేలింది. కార్మిక శాఖ అధికారులు కంపెనీలో తనిఖీ చేయగా ఈ విషయం బయటపడింది. ఈ ఏడాది FEBలో రిజిస్ట్రేషన్ కోసం కార్మిక శాఖకు అప్లై చేశారు. 16 ఏళ్లుగా రిజిస్ట్రేషన్ చేయనందుకు శాఖ నిరాకరించింది. కార్మికుల మరణానికి సంస్థ కారణమైతే ₹5లక్షలు జరిమానా, ఓనర్‌కి 6నెలల జైలుశిక్ష ఉంటుందని అధికారులు తెలిపారు.

Similar News

News December 16, 2025

హనుమంతుడి కుమారుడి గురించి మీకు తెలుసా?

image

పురాణాల ప్రకారం.. హనుమంతుడి చెమట చుక్క ద్వారా ఓ మకరానికి మకరధ్వజుడు జన్మించాడు. ఆయన పాతాళ లోకంలో ద్వారపాలకుడిగా పనిచేశాడు. అయితే ఓనాడు రామలక్ష్మణులను పాతాళంలో బంధిస్తారు. అప్పుడు హనుమంతుడు వారిని రక్షించడానికి అక్కడికి వెళ్తాడు. పాతాళ ద్వారం వద్ద హనుమంతుడికి, తన కుమారుడైన మకరధ్వజుడికి మధ్య యుద్ధం జరుగుతుంది. చివరకు నిజం తెలుసుకొని మకరధ్వజుడు శ్రీరాముడికి సాయం చేస్తాడు.

News December 16, 2025

క్యాబేజీ, కాలీఫ్లవర్‌లో నారుకుళ్లు తెగులు నివారణ

image

క్యాబేజీ, కాలీఫ్లవర్ నారుమడుల్లో నారుకుళ్లు తెగులు కనిపిస్తుంది. దీని వల్ల నారు మొక్కల కాండం, మొదళ్లు మెత్తగా తయారై కుళ్లి, వడలిపోయి చనిపోతాయి. దీని నివారణకు ఎత్తైన మడులపై లేదా ప్రోట్రేలలో నారును పెంచాలి. విత్తనం పలుచగా వరుసల్లో వేయాలి. ఎక్కువ నీటి తడులను ఇవ్వకూడదు. నారు మొలిచిన తర్వాత లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి.

News December 16, 2025

సంజయ్ గాంధీ మెమోరియల్ హాస్పిటల్‌లో ఉద్యోగాలు

image

<>సంజయ్<<>> గాంధీ మెమోరియల్ హాస్పిటల్ 39 పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి MBBS, PG డిగ్రీ, డిప్లొమా, DNB అర్హతతో పాటు పని అనుభవం గలవారు రేపు ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. రిజర్వేషన్ గల అభ్యర్థులకు ఏజ్‌లో సడలింపు ఉంది. జీతం నెలకు రూ.67,700-రూ.2,08,700 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://sgmh.delhi.gov.in