News March 5, 2025
వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి రంగన్న మృతి

AP: వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన రంగన్న(85) కడప రిమ్స్‌లో మృతిచెందారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను పులివెందుల నుంచి కడప తీసుకురాగా చికిత్స పొందుతూ ఇవాళ చనిపోయారు. రంగన్న వివేకా హత్య జరిగిన సమయంలో ఆ ఇంటికి వాచ్‌మెన్‌గా పనిచేశారు.
Similar News
News February 2, 2026
ఉడికించిన గుడ్డు/ ఆమ్లెట్.. ఏది మంచిదంటే?

గుడ్డులో ఎన్నో ప్రొటీన్లు, విటమిన్లు, హెల్తీ ఫాట్స్ ఉంటాయి. అందుకే దీన్ని సూపర్ ఫుడ్ అంటారు. అయితే ఉడికించిన గుడ్డు/ ఆమ్లెట్ ఏది తింటే ప్రయోజనమని చాలామందికి డౌట్ ఉంటుంది. బరువు తగ్గాలనుకుంటే మాత్రం ఉడికించిన గుడ్డు తినాలంటున్నారు నిపుణులు. అలాగే ఆమ్లెట్‌ను తక్కువ నూనె, రకరకాల కూరగాయలతో చేయడం వల్ల రుచికరమైన పోషకాహారం అందుతుందంటున్నారు. ఎలా తిన్నా గుడ్డులోని పోషకాలు అందుతాయని చెబుతున్నారు.
News February 2, 2026
జోగి రమేశ్‌పై కేసు నమోదు

AP: మాజీ మంత్రి జోగి రమేశ్‌పై ఇబ్రహీంపట్నం పీఎస్‌లో కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై తీవ్ర <<19023498>>వ్యాఖ్యలు<<>> చేశారని ఆయనపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం జోగి అజ్ఞాతంలో ఉన్నట్లు సమాచారం. కాగా ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు జోగి రమేశ్ ఇంటికి నిప్పు అంటించిన ఘటనలోనూ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
News February 2, 2026
ఎరువుల ధరలు పెరిగే అవకాశం!

ఎరువుల తయారీలో కీలక ముడిపదార్థాలైన అమ్మోనియం ఫాస్పేట్, అమ్మోనియం నైట్రో ఫాస్పేట్, పొటాషియం సల్ఫేట్ లాంటి ఉత్పత్తులపై కేంద్రం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (BCD) మినహాయింపులను రద్దు చేసింది. దీని వల్ల DAP, NPK వంటి కాంప్లెక్స్ ఎరువుల తయారీ ఖర్చు పెరుగుతుంది. ఫాస్పేట్, పొటాష్ ఆధారిత ఎరువుల ముడి సరుకులను మనం ఎక్కువగా విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. ఈ తరుణంలో ఎరువుల ధరలు కూడా పెరిగే ఛాన్సుంది.


