News January 13, 2026
F-16 యుద్ధ విమానాన్ని కూల్చేశాం: రష్యా

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరింత ముదురుతోంది. తాజాగా అమెరికా సరఫరా చేసిన F-16 యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు రష్యా కమాండర్ సంచలన ప్రకటన చేశారు. S-300 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో రెండు క్షిపణులు ప్రయోగించి ఉక్రెయిన్ గగనతలంలో ఉన్న విమానాన్ని ధ్వంసం చేసినట్లు తెలిపారు. రష్యా మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటి వరకు నాలుగు F-16 యుద్ధ విమానాలు నేలకూలినట్లు తెలుస్తోంది.
Similar News
News February 17, 2026
త్వరలో హాస్టళ్లలోని 1,433 పోస్టుల భర్తీ: సవిత

AP: సంక్షేమ హాస్టళ్లలోని 1,433 కుక్, లేబర్, పారిశుద్ధ్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయనున్నామని మంత్రి సవిత అసెంబ్లీలో వెల్లడించారు. ‘142 కుక్, లేబర్, 1,291 పారిశుద్ధ్య సిబ్బంది పోస్టులు భర్తీ చేస్తాం. కొత్తగా 10 MJP BC గురుకులాలను నెలకొల్పుతాం. 6 గురుకుల స్కూళ్లను కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేస్తాం. పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకోసం ₹420CR, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ₹933 CR కేటాయించాం’ అని వివరించారు.
News February 17, 2026
అజిత్ పవార్ మృతి.. కీలక పరిణామం

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ <<19106331>>మృతి కేసులో<<>> కీలక పరిణామం చోటుచేసుకుంది. విమాన ప్రమాదంపై సీబీఐ విచారణ చేయాలని ఆయన భార్య, Dy.CM సునేత్రా పవార్ డిమాండ్ చేశారు. NCP లీడర్లు, పెద్ద కుమారుడు పార్థ్‌తో ఆమె సీఎం ఫడణవీస్‌ను కలిసి ఈ మేరకు లేఖను అందజేశారు. ‘ఈ విషయంపై కేంద్ర హోంశాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సీఎం హామీ ఇచ్చారు. కేంద్ర సంస్థతో దర్యాప్తు చేయిస్తామన్నారు’ అని NCP నేత సునీల్ వెల్లడించారు.
News February 17, 2026
బరువు పెరగని జపనీస్.. ‘హరా హచి బు’ సీక్రెట్ తెలుసా?

ప్రపంచంలో తక్కువ ఊబకాయం కలిగిన జపాన్ నుంచి భారత్ నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కడుపు 80% నిండాక తినడం ఆపడం (హరా హచి బు), స్కూల్ స్థాయి నుంచే పోషకాహారంపై అవగాహన, చక్కెర తగ్గించడం, నడకను జీవనశైలిలో భాగం చేయడం అక్కడ కీలకం. నడుము కొలతను పర్యవేక్షించే ‘మెటాబో లా’ వంటి చట్టాలు, హెల్తీ ఫుడ్ ఈజీగా దొరకడం వల్ల జపాన్ ఈ ఘనత సాధించింది. ముఖ్యంగా ఫుడ్ విషయంలో మనతో పోలిస్తే వారికి డిసిప్లిన్ చాలా ఎక్కువ.


