News May 20, 2024

Fact Or Myth: ఆహారాన్ని 32 సార్లు నమిలి మింగాలా?

image

‘ఆహారాన్ని వేగంగా తినకుండా ఒక్కో ముద్దను 32 సార్లు నమలాలి’ అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. దీనివెనుక ఆహారం సులభంగా జీర్ణమయ్యే సిద్ధాంతం ఉందని నిపుణులు అంటున్నారు. ‘ఎక్కువసార్లు నమలడం వల్ల లాలాజలం ద్వారా నోటి నుంచే జీర్ణక్రియ ప్రారంభమవుతుంది. ఈ ప్రాధాన్యత చెప్పడానికే దంతాల సంఖ్య ఆధారంగా 32సార్లు నమిలి మింగాలని చెబుతుంటారు. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయి’ అని పేర్కొంటున్నారు.

Similar News

News December 12, 2025

పొగమంచు వేళల్లో వాహనాల రాకపోకలపై నిషేధం: అనిత

image

AP: ఏజెన్సీ ప్రాంతాల్లో వాహన ప్రమాదాల నేపథ్యంలో రాత్రి పూట పొగమంచు వేళల్లో బస్సు, ఇతర వాహన రాకపోకలను నిషేధిస్తున్నట్లు మంత్రి అనిత తెలిపారు. చింతూరు-మారేడుమిల్లి రోడ్డులో BUS ప్రమాదంలో 9మంది మృతి బాధాకరమన్నారు. ‘మృతుల కుటుంబాలకు పరిహారమిస్తాం. ఘాట్ రోడ్లలో వాహనాలు నడిపేవారికి ప్రత్యేక డ్రైవింగ్ లైసెన్స్ ఉండేలా చర్యలు తీసుకుంటాం. చిన్న తప్పిదాల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి’ అని పేర్కొన్నారు.

News December 12, 2025

NHIDCL 64 పోస్టులకు నోటిఫికేషన్

image

<>NHIDCL <<>>64 అసోసియేట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 18 నుంచి జనవరి 12వరకు అప్లై చేసుకోవచ్చు. సివిల్ ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. జీతం నెలకు రూ.70,000-రూ.80,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.nhidcl.com

News December 12, 2025

సుదీర్ఘ నిరీక్షణకు తెర.. రేపటి నుంచి ‘డ్రాగన్’ షూటింగ్!

image

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ‘డ్రాగన్’ సినిమా షూటింగ్ ఎట్టకేలకు తిరిగి ప్రారంభంకానుంది. ఏప్రిల్‌లో 2 వారాల షూటింగ్ తర్వాత 6నెలలు గ్యాప్ ఇచ్చిన మేకర్స్ రేపటి నుంచి చిత్రీకరణలో బిజీ కానున్నారు. మూడు వారాల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో కీలక సీన్లు, సాంగ్‌ను చిత్రీకరించనున్నారు. రెండు పార్టుల షూటింగ్‌ను ఒకేసారి పూర్తిచేసి తొలి భాగాన్ని 2026 DECలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.