News June 16, 2024
త్వరలోనే వాస్తవాలు బయటపడతాయి: యడియూరప్ప

అనవసరమైన గందరగోళాన్ని సృష్టించేందుకే తనపై పోక్సో <<13434208>>కేసు<<>> నమోదు చేశారని కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప అన్నారు. త్వరలోనే ఈ కేసులో వాస్తవాలు బయటపడతాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 17న CID విచారణకు హాజరవుతానని చెప్పారు. ఈ కేసులో తాను ఎవరిని తప్పుపట్టడం లేదని, కాలమే అన్నింటిని నిర్ణయిస్తుందని తెలిపారు. తనపై కుట్రలు చేసిన వారికి ప్రజలే బుద్ధి చెప్తారని పేర్కొన్నారు.
Similar News
News November 6, 2025
‘Google Photos’లో అదిరిపోయే ఫీచర్

చాలామంది తమ ఫోన్లో దిగిన ఫొటోలను ఫ్రెండ్స్‌కు పంపేందుకు వాట్సాప్ వాడతారు. ఇలా చేస్తే ఫొటోల క్లారిటీ తగ్గుతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా ‘గూగుల్ ఫొటోస్’ యాప్‌లో డైరెక్ట్‌గా మీ ఫ్రెండ్ మెయిల్ ఐడీకి యాక్సెస్ ఇవ్వొచ్చు. దీనికోసం <
News November 6, 2025
స్కూళ్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు

TG: అన్ని స్కూళ్లలో రేపు ఉదయం 10 గంటలకు వందేమాతరం ఆలపించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వందేమాతరం రచించి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టాలని కేంద్రం చెప్పిన నేపథ్యంలో సర్కార్ తాజాగా ఉత్తర్వులిచ్చింది. పాఠశాలలతో పాటు కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పనిసరిగా వందేమాతరం పాడాలని అందులో పేర్కొంది. ఇక దేశ ప్రజలంతా ఇందులో పాల్గొనాలని కేంద్రం కోరింది.
News November 6, 2025
ట్రంప్ ఉక్కుపాదం.. 80వేల వీసాల రద్దు

అక్రమ వలసదారులతోపాటు వీసాలపై వచ్చి ఉల్లంఘనలకు పాల్పడుతున్నవారిపైనా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్నారు. జనవరి నుంచి 80వేల వీసాలను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. హింస, దాడులు, చోరీ, డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడిన వారే అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు. గడువు ముగిసినా దేశంలో ఉండటం, స్థానిక చట్టాలను లెక్కచేయని 6వేలకు పైగా స్టూడెంట్ల వీసాలూ రద్దయినట్లు మీడియా తెలిపింది.


