News March 30, 2024
సివిల్స్లో ఫెయిల్.. కానీ IAS అయ్యారు!

క్లిష్టమైన పరీక్షల్లో సివిల్స్ ఒకటి. ఈ పరీక్షలో ఫెయిల్ అయినా.. IAS అయిన కేరళకు చెందిన అబ్దుల్ నాసర్ గురించి మీకు తెలుసా? ఆయన 5 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయి అనాథాశ్రమంలో పెరిగారు. ఎన్నో సవాళ్ల నడుమ పీజీ పూర్తి చేశారు. 1994లో ఆరోగ్యశాఖలో ప్రభుత్వ ఉద్యోగం సాధించిన ఆయన.. వృత్తిపరంగా కనబర్చిన నిబద్ధత, కృషికి గాను 2006 నాటికి డిప్యూటీ కలెక్టర్ అయ్యారు. 2017లో IAS హోదా పొంది తన కలను నెరవేర్చుకున్నారు.
Similar News
News December 5, 2025
రాష్ట్రపతి భవన్కు పుతిన్.. ఘన స్వాగతం

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్కు చేరుకున్నారు. ఆయనకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఘన స్వాగతం పలికారు. పుతిన్ గౌరవార్థం అక్కడ విందు ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, రాయబారులు పాల్గొంటున్నారు. అయితే ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ ఖర్గేకు ఆహ్వానం అందలేదు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ను ఆహ్వానించడం గమనార్హం.
News December 5, 2025
హోంలోన్లు తీసుకునేవారికి గుడ్న్యూస్

RBI <<18475069>>నిర్ణయంతో<<>> హోంలోన్లపై వడ్డీరేటు కనిష్ఠ స్థాయికి చేరుకోనుంది. యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ప్రస్తుతం గృహ రుణాలపై వడ్డీరేటు 7.35శాతంతో మొదలవుతోంది. ఇకపై ఇది 7.1శాతానికి పడిపోనుంది. గృహరుణాలు తీసుకోవడానికి ఇదే మంచి తరుణమని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. మీరూ హోం లోన్ తీసుకుంటున్నారా?
News December 5, 2025
కులాల కుంపట్లలో పార్టీలు.. యువతా మేలుకో!

తెలంగాణ పోరులో నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలకు పరిమితమైతే శ్రీకాంతాచారి సహా ఎంతో మంది సామాన్యులు ప్రాణత్యాగం చేశారు. ఇప్పుడు BC రిజర్వేషన్ల వ్యవహారంలో కులాల కుంపట్లను రాజేసి చలికాచుకునే పనిలో అన్నిపార్టీలు ఉన్నట్లు కనిపిస్తోంది. ఈశ్వరాచారి <<18478689>>ఆత్మహత్యే<<>> ఇందుకు నిదర్శనం. అవకాశవాద నాయకుల ఉచ్చులో పడకుండా యువత సంయమనం పాటించాలి. డిమాండ్ల సాధన కోసం పోరాటాలు చేయండి.. కానీ ప్రాణాలు తీసుకోవద్దు.


