News April 25, 2024
పరీక్ష ఫెయిల్ అయ్యారా?

TG: ఇంటర్లో ఫెయిలైన పలువురు విద్యార్థులు మానసిక స్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవడమే దీనికి పరిష్కార మార్గమనుకుని వారి కుటుంబాల్లో విషాదం నింపుతున్నారు. అయితే ఒక పరీక్ష తప్పితే జీవితం మొత్తం ఓడినట్లు కాదనే విషయాన్ని విద్యార్థులు గుర్తుంచుకోవాలని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ఓటమినే గెలుపునకు పునాదిగా చేసుకుని ఉన్నతంగా ఎదగవచ్చని సూచిస్తున్నారు.
Similar News
News March 20, 2026
మెట్రో ఫేజ్-2కు ‘కేంద్ర’ గండం.. బడ్జెట్లో నిధులెక్కడ?

మెట్రో రెండో దశ విస్తరణకు కేంద్రం రూ. 28,740 కోట్లు ఇస్తామని చెబుతున్నా అదంతా ఒక ‘కండిషన్’ మీద ఆధారపడి ఉంది. ఫేజ్-1 నుంచి ఎల్ అండ్ టీ పూర్తిగా తప్పుకొని రాష్ట్ర ప్రభుత్వం పక్కా డీపీఆర్ సమర్పిస్తేనే పైసలు విడుదల చేస్తామని ఢిల్లీ స్పష్టం చేసింది. ఈరోజు రాష్ట్ర బడ్జెట్లో మెట్రో కోసం కేటాయిస్తున్న నిధులు కేవలం ‘మ్యాచింగ్ గ్రాంట్స్’ గానే కనిపించనున్నాయని తెలుస్తుంది.
News March 20, 2026
IPL: ఇంజ్యూర్డ్ ప్రీమియర్ లీగ్.. నెట్టింట ట్రోల్స్

IPL కీలక ప్లేయర్లు గాయాలబారిన పడి లీగ్‌కు దూరం అవుతున్నారు. దీంతో IPLను ఇంజ్యూర్డ్ ప్రీమియర్ లీగ్ అంటూ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. ఎల్లిస్(CSK), సామ్ కరన్(RR), హర్షిత్(KKR), మిల్నే(RR), జాక్ ఎడ్వర్డ్స్(SRH), హసరంగా(LSG) ఇప్పటికే లీగ్ నుంచి వైదొలిగారు. ఇక హేజిల్ వుడ్(RCB), కమిన్స్(SRH) గాయాలతో కొన్ని మ్యాచులకు దూరం కానున్నారు. ఈనెల 28న లీగ్ ప్రారంభమయ్యేలోపు ఇంకెంత మంది ఇలా గాయాలబారిన పడతారో?
News March 20, 2026
చలాన్ కట్టకపోతే లైసెన్స్, RC ఫ్రీజ్!

TG: సకాలంలో చలాన్లు చెల్లించకపోతే డ్రైవింగ్ లైసెన్స్, RC ఫ్రీజ్ చేసే దిశగా ప్రభుత్వం కొత్త రూల్ తెస్తోంది. ఏడాదికి 5 కంటే ఎక్కువ చలాన్లు ఉండి, అవి చెల్లించకపోతే చర్యలు చేపడతారు. ఇందుకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ రానుంది. కేంద్ర మోటార్ వాహన నిబంధనల ప్రకారం చలాన్లపై అభ్యంతరాలను వేగంగా పరిష్కరించేందుకు గ్రీవెన్స్ రెడ్రెసల్ అథారిటీని ఏర్పాటు చేయనుంది. వాహనదారులు ఇందులో ఫిర్యాదు చేయవచ్చు.


