News April 5, 2025
ఏడుగురి ప్రాణాలు తీసిన ఫేక్ డాక్టర్!

మధ్యప్రదేశ్ దామోహ్‌లో ఓ ఫేక్ డాక్టర్ ఏడుగురి ప్రాణాలను బలిగొన్నాడు. నరేంద్ర విక్రమాదిత్య యాదవ్ అనే వ్యక్తి ఫేక్ డాక్యుమెంట్లతో ప్రముఖ బ్రిటీష్ కార్డియాలజిస్ట్ అయిన N.జాన్ కెమ్ పేరు చెప్పుకుని ప్రైవేట్ మిషనరీ ఆస్పత్రిలో చేరాడు. కొంతమంది రోగులకు హార్ట్ ఆపరేషన్లు చేయగా అందులో ఏడుగురు కొన్ని రోజులకు మరణించారు. ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని పలువురు చెబుతున్నారు. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు.
Similar News
News December 2, 2025
జగిత్యాల సర్పంచ్‌కి 508.. కరీంనగర్ సర్పంచ్‌కి 431

స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్లో రెండోవిడతలో 418 GPలకు, 3794 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. కాగా రెండో విడతకు సంబంధించి రెండోరోజు జోరుగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటివరకు కరీంనగర్ జిల్లా సర్పంచ్‌కి 431, వార్డు సభ్యులకు 1287, సిరిసిల్ల జిల్లా సర్పంచికి 311, వార్డు సభ్యులకు 692, జగిత్యాల సర్పంచ్‌కి 508, వార్డు సభ్యులకు 1279, PDPL సర్పంచ్‌కి 295, వార్డు సభ్యులకు 810 నామినేషన్లు వచ్చాయి.
News December 2, 2025
IPLకు మరో స్టార్ ప్లేయర్ దూరం!

ఐపీఎల్-2026కు మరో స్టార్ ప్లేయర్ దూరమైనట్లు తెలుస్తోంది. ఈ నెలలో జరిగే మినీ వేలం కోసం ఆస్ట్రేలియన్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ రిజిస్టర్ చేసుకోలేదని సమాచారం. గత సీజన్లో మ్యాక్సీ పంజాబ్ తరఫున ఆడగా తిరిగి రిటైన్ చేసుకోని సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన వచ్చే సీజన్ ఆడేది అనుమానమేనని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే డుప్లెసిస్, రసెల్ వంటి స్టార్లు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
News December 2, 2025
మెంతులను ఎక్కువగా తీసుకుంటున్నారా?

మెంతులను తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలుంటాయని తెలిసిందే. కానీ గర్భిణులు వీటిని తీసుకోవడం వల్ల కొన్నిసార్లు అబార్షన్ కావడం, పుట్టే బిడ్డలో మాపుల్ సిరప్ యూరిన్ డిసీజ్ అనే జన్యు సంబంధిత సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే కొన్ని రకాల రొమ్ము క్యాన్సర్లలో ఈస్ట్రోజెన్ ఆధారిత కణితులను ఇది మరింత ప్రేరేపిస్తుందంటున్నారు. కాబట్టి వీటిని వాడేముందు వైద్యుల సలహా తప్పనిసరి అని సూచిస్తున్నారు.


