News January 25, 2025

‘ఆపరేషన్ కగార్’ పేరుతో బూటకపు ఎన్‌కౌంటర్లు: హరగోపాల్

image

TG: ఛత్తీస్‌గఢ్‌లో ఆపరేషన్ కగార్ పేరిట కేంద్రం బూటకపు ఎన్‌కౌంటర్లు చేస్తోందని ప్రొఫెసర్ హరగోపాల్ ఆరోపించారు. వెంటనే ఆ ఆపరేషన్‌ను నిలిపివేయాలన్నారు. బస్తర్‌లో జరుగుతున్న ఎన్‌కౌంటర్లపై HYDలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివాసీలను అడవుల నుంచి పంపించి, ఖనిజ సంపదను కార్పొరేట్లకు ధారాదత్తం చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందన్నారు. కాగా ఇటీవలి ఎన్‌కౌంటర్లలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మరణించారు.

Similar News

News December 6, 2025

విశాఖ విమానాశ్రయంలో అయ్యప్ప స్వాముల కష్టాలు

image

విశాఖ విమానాశ్రయంలోనూ అయ్యప్ప స్వాములు అవస్థలు పడుతున్నారు. రెండు రోజులుగా చుక్కలు చూపిస్తున్న ఇండిగో సర్వీసులు శనివారం కూడా రుద్దయ్యాయి. శబరిమల వెళ్లేందుకు నగరం నుంచి చాలామంది ముందుగానే విమాన టికెట్లు రిజర్వేషన్ చేసుకున్నారు. అయితే ఒక్కసారిగా అన్ని సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ఇండిగో ప్రయాణికులకు మెసేజ్‌లు పంపింది. దీంతో స్వాములు ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు.

News December 6, 2025

ఇండిగో సంక్షోభం: CJI జోక్యం చేసుకోవాలని పిల్

image

ఇండిగో సంక్షోభంపై CJI జోక్యం చేసుకోవాలని కోరుతూ పిల్ దాఖలైంది. విమానయాన శాఖ, DGCA నుంచి స్టేటస్ రిపోర్టు తీసుకోవాలని, తక్షణ విచారణ కోసం ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో అత్యవసర విచారణ కోసం పిటిషనర్ న్యాయవాదిని తన నివాసానికి పిలిపించి CJI మాట్లాడనున్నారని సమాచారం. మరోవైపు ఇండిగో సర్వీసులపై సమాచారం తెలుసుకుని రావాలని ప్రయాణికులను బెంగళూరు ఎయిర్‌పోర్టు కోరింది.

News December 6, 2025

NCCDలో ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

నేషనల్ సెంటర్ ఫర్ కోల్డ్‌చైన్ డెవలప్‌మెంట్‌లో 5 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు contact-nccd@gov.in ఈ మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. పోస్టును బట్టి బీఈ, బీటెక్, పీజీ(అగ్రి బిజినెస్), ఎంకామ్, సీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: nccd.gov.in.