News December 28, 2024

పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ అధికారి!

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్వతీపురం పర్యటనలో నకిలీ ఐపీఎస్ అధికారి కలకలం రేపాడు. పోలీసు అధికారిలా యూనిఫాంతో హడావుడి చేయగా అనుమానం వచ్చిన కొందరు అతనిపై ఫిర్యాదు చేశారు. అతడిని విజయనగరం జిల్లాకు చెందిన సూర్యప్రకాశ్‌గా గుర్తించారు. పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటనపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ ఐపీఎస్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Similar News

News November 5, 2025

నవంబర్ 24 నుంచి పార్లమెంటు సమావేశాలు!

image

పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్ చివరి వారంలో ప్రారంభం కానున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. పార్లమెంటు ఉభయ సభలు ఈనెల 24 లేదా 25 నుంచి సమావేశం అవుతాయని పేర్కొన్నాయి. డిసెంబర్ 19 వరకు ఇవి కొనసాగుతాయని చెప్పాయి. కాగా EC చేపట్టిన దేశవ్యాప్త SIRను వ్యతిరేకిస్తూ ఓట్ చోరీ అంటూ విమర్శలు గుప్పిస్తున్న విపక్షాలు దీనిపై చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది. US టారిఫ్స్‌పైనా ప్రస్తావించవచ్చని తెలుస్తోంది.

News November 5, 2025

OFFICIAL: కమల్ ప్రొడక్షన్‌లో రజినీ సినిమా

image

తమిళ సినీ దిగ్గజాలు రజినీకాంత్, కమల్ హాసన్ ఓ సినిమా కోసం చేతులు కలిపారు. కమల్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో రజినీకాంత్ హీరోగా ఈ మూవీ తెరకెక్కనుంది. దీనికి సి.సుందర్ దర్శకత్వం వహించనున్నారు. సూపర్ స్టార్‌కు 173వ సినిమా ఇది. ఈ మూవీని 2027 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు కమల్ హాసన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

News November 5, 2025

టీటీడీకి రూ.1000 కోట్ల విరాళాలు: బీఆర్ నాయుడు

image

AP: గత ఏడాది కాలంలో TTDకి రూ.1000Cr విరాళాలు వచ్చాయని బోర్డు ఛైర్మన్ BR నాయుడు వెల్లడించారు. ఛైర్మన్‌గా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘శ్రీవాణి ట్రస్ట్ కింద 5వేల ఆలయాలు నిర్మించాలని తీర్మానించాం. తిరుపతి-తిరుమల మధ్య ఎలక్ట్రికల్ బస్సులు నడపాలని యోచిస్తున్నాం. తిరుపతి విమానాశ్రయానికి శ్రీవెంకటేశ్వర ఎయిర్‌పోర్టుగా నామకరణం చేస్తాం’ అని పేర్కొన్నారు.