News October 9, 2025
నకిలీ మద్యం కేసును రాజకీయం చేస్తున్నారు: కొల్లు

AP: నకిలీ మద్యం కేసుపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ‘తెనాలి వాసి కొడాలి శ్రీనివాస్, జయచంద్రారెడ్డి అనే వ్యక్తులకు నకిలీ మద్యంతో సంబంధముంది. ఇబ్రహీంపట్నంకు చెందిన జగన్మోహన్‌రావును పట్టుకున్నాం. ఈ అంశాన్ని ప్రతిపక్షం రాజకీయం చేయడం దారుణం. TDPకి చెందిన జయచంద్రారెడ్డిపై వెంటనే చర్యలు చేపట్టాం కానీ YCP నేత శ్రీనివాస్‌పై ఆ పార్టీ చర్యలు తీసుకోలేదు’ అని మండిపడ్డారు.
Similar News
News October 9, 2025
లంచం అడిగిన వైద్యుడు.. విధుల నుంచి తొలగింపు

AP: మానసిక వైకల్యమున్న కుమార్తెకు సదరం సర్టిఫికెట్ కోసం ఆమె తండ్రిని లంచం అడిగిన డాక్టర్‌ని విధుల నుంచి తొలగించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. కడప GGHలోని ఆ డాక్టర్ ఏప్రిల్‌లో ₹10వేలు డిమాండ్ చేశాడు. ₹7వేలు ఇస్తానన్నా అంగీకరించలేదు. రెండ్రోజుల్లో ఇవ్వాల్సిందేనని గడువు పెట్టాడు. ఫిర్యాదు రాగా ఏసీబీ విచారణలో వాస్తవమేనని తేలింది. దీంతో సర్వీసు నుంచి అతణ్ని తొలగించాలని మంత్రి ఆదేశాలిచ్చారు.
News October 9, 2025
ప్రభుత్వ చిత్తశుద్ధి లేమికి స్టే నిదర్శనం: కిషన్ రెడ్డి

TG: BC రిజర్వేషన్లపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రజలకు లబ్ధి చేకూర్చాలని కాకుండా రాజకీయ ప్రయోజనం కోసం అసంబద్ధ బిల్లు, GO తీసుకొచ్చి డ్రామా చేస్తోందన్నారు. అటు ప్రభుత్వానికి ఎన్నికలు నిర్వహించే ఉద్దేశం లేదని TBJP చీఫ్ రామ్‌చందర్‌రావు, MP ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలోనే 50% పరిమితి పెట్టి ఇప్పుడు పెంపు అనడం CM అవగాహన లేమికి నిదర్శనమన్నారు.
News October 9, 2025
హైకోర్టు ఆదేశాలు పాటిస్తాం: ఎన్నికల సంఘం

స్థానిక ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు ఆదేశాలను పాటిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు సింగిల్ సెంటెన్స్‌తో ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. నోటిఫికేషన్‌పై న్యాయస్థానం స్టే విధించడంతో పాటు SEC కూడా దీనికి అంగీకరించడంతో ప్రస్తుతం ఎన్నికల కోడ్ లేనట్లేనని స్పష్టమవుతోంది.