News March 21, 2024
వాలంటీర్లపై APCEO పేరుతో ఫేక్ న్యూస్..
AP: ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రచారాల్లో పాల్గొంటున్న వాలంటీర్లపై ఉన్నతాధికారులు వేటు వేస్తున్నారు. మరోవైపు ఇదే అంశంపై ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పేరుతో ఓ న్యూస్ వైరలవుతోంది. ‘ఎన్నికల కమిషనర్ నిర్ణయం.. రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న వాలంటీర్లు కనబడితే వెంటనే ఫొటో లేదా వీడియో తీసి 9676692888కు వాట్సాప్ చేయండి’ అని అందులో ఉంది. అయితే ఇది ఫేక్ న్యూస్ అని APCEO ట్వీట్ చేశారు.
Similar News
News January 8, 2025
వాట్సాప్‌లో ‘ఫొటో పోల్స్’
వాట్సాప్ ‘ఫొటో పోల్స్’ ఫీచర్‌ను తీసుకురానుంది. దీని ద్వారా టెక్స్ట్‌తో అవసరం లేకుండా పోల్స్‌లో ఫొటోలను అటాచ్ చేసేందుకు వీలుంటుంది. ముందుగా ఛానల్స్‌లో అందుబాటులోకి రానున్న ఈ ఫీచర్‌ను ఆ తర్వాత గ్రూప్ చాట్స్, పర్సనల్ చాట్స్‌లోనూ ప్రవేశపెడతారని వాట్సాప్ బీటా ఇన్ఫో వెల్లడించింది. టెక్స్ట్‌లో చెప్పలేని విషయాలను ఫొటోలతో ఈజీగా చెప్పేందుకు ఈ ఫీచర్ సాయపడనుందని పేర్కొంది.
News January 8, 2025
నేడు అక్కడ స్కూళ్లకు సెలవు
AP: ప్రధాని విశాఖ పర్యటన నేపథ్యంలో నేడు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) పరిధిలోని అన్ని స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు డీఈవో ప్రేమ్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. బస్సుల కొరతతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రత్యామ్నాయంగా మరో రోజు స్కూళ్లు పనిచేయాల్సి ఉంటుందన్నారు. నేడు సాయంత్రం మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విశాఖలో రోడ్ షో చేయనున్నారు.
News January 8, 2025
నెల్లూరు జిల్లా నేతలతో నేడు జగన్ సమావేశం
AP: మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నేడు నెల్లూరు జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ జిల్లాకు చెందిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ ఛైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో మాట్లాడనున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత జిల్లాల్లో పార్టీ బలోపేతంపై దృష్టిసారించిన జగన్ భవిష్యత్ కార్యాచరణపై ఒక్కో జిల్లా నేతలతో సమావేశం అవుతోన్న విషయం తెలిసిందే.