News August 27, 2024

రైలు ప్రమాదమంటూ ఫేక్ పోస్ట్.. కాంగ్రెస్‌పై రైల్వే శాఖ ఫైర్

image

ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో రైలు ప్రమాదం జరిగిందని, లోకో పైలట్‌తో పాటు మరికొందరికి గాయాలైనట్లు కాంగ్రెస్ ట్వీట్ చేసింది. దీనిపై రైల్వే శాఖ ఘాటుగా స్పందించింది. దేశాన్ని తప్పుదోవ పట్టించొద్దని, పోస్టులోని ఇంజిన్, డ్రైవర్ భారతీయ రైల్వేకు చెందినవారు కాదని స్పష్టం చేసింది. రైల్వేపై తప్పుడు ఆరోపణలు చేయొద్దని పేర్కొంది. పోస్ట్ పెట్టిన వారిపై కేసు నమోదు చేయాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Similar News

News March 5, 2026

గ్రామ సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్

image

AP: స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులోని అన్ని విభాగాల ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పిస్తామని మంత్రి డోలా వీరాంజనేయస్వామి వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుగా మార్చే బిల్లుకు నిన్న శాసనమండలిలో ఆమోదం లభించింది. YCP హయాంలో లోపభూయిష్టంగా ఉన్న వ్యవస్ధను పటిష్టంగా తీర్చిదిద్దుతున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. వీటితో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు.

News March 5, 2026

సీఐఏను సంప్రదించిన ఇరాన్ ఇంటెలిజెన్స్?

image

మిడిల్ ఈస్ట్‌లో టెన్షన్స్‌పై USతో చర్చలకు నో చెబుతున్నా అంతర్గతంగా ఇరాన్ ఇంటెలిజెన్స్ ప్రయత్నాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. US నిఘా సంస్థ సీఐఏతో చర్చలకు సుముఖత వ్యక్తం చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం తెలిపింది. ఇందుకు మరో దేశ స్పై ఏజెన్సీ మధ్యవర్తిత్వం వహిస్తోందని ఇరు దేశాల అధికారులు చెప్పినట్లు రిపోర్ట్ చెబుతోంది. అయితే తమ హైకమాండ్ ఎలా స్పందిస్తుందోనని ఏజెన్సీలు సందిగ్ధంలో ఉన్నట్లు పేర్కొంది.

News March 5, 2026

చాట్ GPTకి షాక్.. 25 లక్షల మంది యూజర్లు ఔట్!

image

చాట్ GPTకి యూజర్లు షాకిచ్చారు. 25 లక్షల మంది దాన్ని బాయ్‌కాట్ చేసినట్లు తెలుస్తోంది. అమెరికా రక్షణ శాఖలో ఏఐ మోడల్స్ వినియోగానికి OpenAI ఒప్పందం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. మిలిటరీ ఆపరేషన్లలో AI వినియోగానికి మద్దతు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సబ్‌స్క్రిప్షన్లు రద్దు చేసుకుంటున్నారు. బాయ్‌కాట్ చేస్తామని వెబ్‌సైట్‌(https://quitgpt.org/)లో సంతకాలు చేస్తున్నారు.