News June 12, 2024
‘మెకానిక్ రాకీ’పై ఫేక్ ట్వీట్.. కౌంటర్ ఇచ్చిన విశ్వక్ సేన్
రవితేజ ముళ్లపూడి తెరకెక్కిస్తోన్న ‘మెకానిక్ రాకీ’ సినిమా నాలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ను రూ.8 కోట్లకు విక్రయించినట్లు వస్తోన్న వార్తలను హీరో విశ్వక్ సేన్ ఖండించారు. ఓ నెటిజన్ ట్వీట్కు స్పందిస్తూ.. ‘గాడిద గుడ్డేం కాదు. టీ షాపు ముచ్చట్లు తీసుకొచ్చి ట్విటర్లో పెట్టొద్దు ప్రియాజీ. మెకానిక్ రాకీని మేమింకా ఎవరికీ అమ్మనేలేదు. నిజం తెలుసుకోండి. ఇది మేకర్స్ కెరీర్’ అని కౌంటర్ ఇచ్చారు.
Similar News
News December 28, 2024
మాతృభాషను భవిష్యత్ తరాలకు పదిలంగా అందించాలి: చంద్రబాబు
AP: మాతృభాషను భవిష్యత్ తరాలకు పదిలంగా అందించాలని CM చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు విజయవాడలో నిర్వహించడం తెలుగువారికి గర్వకారణమని పేర్కొన్నారు. ‘తెలుగు జాతి కోసం పొట్టిశ్రీరాములు అద్వితీయ త్యాగం చేశారు. సభల ప్రాంగణానికి ఆయన పేరు పెట్టడం అభినందనీయం. మహాసభలకు విచ్చేసిన అతిథులు, భాషాభిమానులకు ధన్యవాదాలు’ అంటూ Xలో ట్వీట్ చేశారు.
News December 28, 2024
డిసెంబర్ 30న అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 30వ తేదీన ప్రత్యేకంగా జరగనున్నాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలిపేందుకు ఈ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యేలకు సమాచారం అందించారు.
News December 28, 2024
వారికి నెలలోపే కొత్త పెన్షన్
AP: పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోతే అదే నెలలోనే భార్యకు ప్రభుత్వం పెన్షన్ అందించనుంది. నవంబర్ 1 నుంచి ఈ నెల 15 మధ్య వితంతువులుగా మారిన 5,402 మందికి స్పౌజ్ కేటగిరీలో ఈ నెల 31న రూ.4వేల చొప్పున పంపిణీ చేయనుంది. అలాగే 3 నెలల వ్యవధిలో పింఛన్ తీసుకోలేని దాదాపు 50వేల మందికి 2, 3 నెలల మొత్తాన్ని ఒకేసారి అందివ్వనుంది. న్యూఇయర్ కానుకగా ఒకరోజు ముందే ప్రభుత్వం పెన్షన్లు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.