News April 2, 2024
FakeNews: వార్తల వెరిఫికేషన్ చాలా సులువు
Way2News లోగోతో కొందరు తప్పుడు వార్తలు వైరల్ చేస్తున్నారు. వీటిని నమ్మినా, షేర్ చేసినా మనం ఇబ్బందులు పడవచ్చు. మేము పబ్లిష్ చేసే ఆర్టికల్‌కు యునిక్ కోడ్ ఉంటుంది. ఈ కోడ్‌ను fc.way2news.comలో ఎంటర్ చేస్తే ఆ ఫార్వర్డ్ ఆర్టికల్ కన్పించాలి. లేదంటే మీకు వచ్చిన స్క్రీన్‌షాట్ మాది కాదు అని గ్రహించండి. మీరు Way2News లోగోతో ఫేక్ వార్తలు పొందితే ఈ-మెయిల్‌లో రిపోర్ట్ చేయడి.
grievance@way2news.com
-ధన్యవాదాలు
Similar News
News November 8, 2024
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోస్టుకార్డుల ఉద్యమం
AP: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోస్టుకార్డుల ఉద్యమానికి ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ సిద్ధమైంది. ఈ నెల 10న విశాఖ ఆర్కే బీచ్ రోడ్ కాళీ మాత ఆలయం వద్ద ఈ ఉద్యమం ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీకి దాదాపు 10 లక్షల పోస్టుకార్డులు పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని ఈ కార్డుల ద్వారా ప్రధానిని కోరుతామని కన్వీనర్ రమణమూర్తి చెప్పారు.
News November 8, 2024
DEC 18 నుంచి డిపార్ట్‌మెంటల్ టెస్టులు
AP: ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందికి నిర్వహించే డిపార్ట్‌మెంటల్ టెస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అభ్యర్థులు ఈ నెల 13 నుంచి వచ్చే నెల 3 వరకు అప్లై చేసుకోవాలని సూచించింది. డిసెంబర్ 18 నుంచి 23 వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపింది. పూర్తి వివరాల కోసం <
News November 8, 2024
ఓటీటీలోకి వచ్చేసిన ‘దేవర’
ఓటీటీ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ నెట్‌ఫ్లిక్స్‌లో అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ అందుబాటులో ఉంది. త్వరలోనే హిందీలోనూ స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. కొరటాల శివ డైరెక్షన్‌లో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా రూ.500కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన విషయం తెలిసిందే.