News February 3, 2025

బీసీల పొట్ట కొట్టడానికే తప్పుడు లెక్కలు: ఆర్. కృష్ణయ్య

image

TG: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కులగణన లెక్కలు తప్పు అని MP ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. ‘KCR చేసిన సర్వేలో 52% BCలు ఉన్నారు. మురళీధర్, మండల్ కమిషన్ రిపోర్ట్ ప్రకారమూ అంతే శాతం ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతమే బీసీలు ఉన్నట్లు చూపిస్తోంది. BCల పొట్ట కొట్టడానికే తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు. EWS రిజర్వేషన్లు కాపాడేందుకు BCలకు అన్యాయం చేస్తున్నారు. ఈ లెక్కలను మళ్లీ రివ్యూ చేయాలి’ అని కోరారు.

Similar News

News January 23, 2026

నేడు ఏ రంగు దుస్తులు ధరించాలంటే..?

image

వసంత పంచమి నాడు పసుపు రంగుకు అధిక ప్రాధాన్యత ఉంది. ఇది జ్ఞానానికి, కొత్త చిగురులకు, సూర్యకాంతికి చిహ్నం. ఈరోజున భక్తులు పసుపు రంగు దుస్తులు ధరించి పూజలో పాల్గొంటే మనసు ప్రశాంతంగా మారుతుంది. పూజలో పసుపు రంగు పువ్వులు, పసుపు అక్షింతలు వాడటంతో పాటు, నైవేద్యంగా పసుపు రంగు వంటకాలు సమర్పిస్తే సానుకూల శక్తి పెరుగుతుందని ప్రగాఢ విశ్వాసం. అలాగే సరస్వతీ దేవి అనుగ్రహంతో విద్యాబుద్ధులు సొంతమవుతాయని నమ్మకం.

News January 23, 2026

₹లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు: భట్టి

image

TG: మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాబోయే ఐదేళ్లలో మహిళా సంఘాలకు రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలను అందజేస్తామని తెలిపారు. ‘ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడమే కాదు. ప్రతివారం బిల్లులు ఇస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులు ఆలస్యం చేయకుండా ఇళ్లు నిర్మించుకోవాలి. బిల్లు చెల్లించే బాధ్యత మాది’ అని ఆసిఫాబాద్ జిల్లా జంగాంలో చెప్పారు.

News January 23, 2026

రిపబ్లిక్ డే పరేడ్‌లో AP, TG శకటాలకు నో ఛాన్స్

image

ఢిల్లీలో నిర్వహిస్తున్న రిపబ్లిక్ డే పరేడ్‌లో ఈసారి 30 శకటాలను ప్రదర్శించనున్నారు. 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, 13 కేంద్ర శాఖల శకటాలు ఇందులో ఉంటాయి. ఈ పరేడ్‌లో AP, TGకు చెందిన శకటాలకు అవకాశం దక్కలేదు. అందుకు సెలక్షన్ మాత్రమే కాకుండా.. డిఫెన్స్ మినిస్ట్రీ తీసుకొచ్చిన రొటేషన్ పాలసీ కూడా కారణం. 2024, 2025, 2026లో అన్ని రాష్ట్రాలు, UTలకు ఒక్క అవకాశమైనా వచ్చేలా చేస్తామని అందులో పేర్కొన్నారు.