News April 5, 2024

నాణ్యతలేని మద్యంతో రోడ్డున పడుతోన్న కుటుంబాలు: పురందీశ్వరి

image

AP: వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి ఫైరయ్యారు. ‘ప్రస్తుతం ప్రతి వ్యక్తిపై రూ.2 లక్షల భారం ఉంది. సచివాలయం, గనులను తాకట్టు పెట్టేందుకు జగన్ సిద్ధమయ్యారు. నాణ్యతలేని మద్యం అమ్ముతున్నారు. అది తాగి వందలాది మంది అనారోగ్యానికి గురవుతున్నారు. కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మే 13 తర్వాత రాష్ట్రంలో మార్పు మొదలవుతుంది’ అని పేర్కొన్నారు.

Similar News

News January 29, 2026

OTTలోకి వచ్చేసిన ఛాంపియన్ మూవీ

image

రోషన్ హీరోగా అనస్వర, అవంతిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘ఛాంపియన్’ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. గతనెల 25న విడుదలైన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంది. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను స్పప్న దత్ నిర్మాణంలో ప్రదీప్ అద్వైతం తెరకెక్కించారు. సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిన ‘గిర గిర గింగిరాగిరే’ సాంగ్ ఈ మూవీలోనిదే.

News January 29, 2026

భారీ జీతంతో ఉడిపి కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>ఉడిపి<<>> కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌ 13 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు ఫిబ్రవరి 17 వరకు అప్లై చేసుకోవచ్చు. PPP, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. AGMకు నెలకు రూ.1.65,440, Sr. మేనేజర్‌కు రూ.1,44,760, మేనేజర్‌కు రూ.1,24,080, డిప్యూటీ మేనేజర్‌కు రూ.1,03,400 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://cochinshipyard.in

News January 29, 2026

పిల్లల్లో కడుపునొప్పికి కారణాలు

image

పసిపిల్లల్లో కడుపునొప్పి వివిధ కారణాల వల్ల వస్తుంది. సాధారణంగా వైరస్‌, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు, నులి పురుగులు, కోలిక్ సమస్య వల్ల చిన్నారుల్లో కడుపునొప్పి వస్తుంది. సాధారణంగా ఇవి రెండురోజుల్లో తగ్గిపోతాయి. తగ్గకపోగా విరేచనాలు, వాంతులు కూడా అవుతుంటే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. ఇంట్లో ఉండి నాటు వైద్యాలు చేయడం వల్ల పరిస్థితి ప్రమాదకరంగా మారొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.