News August 28, 2025
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ ఫ్యామిలీ కార్డు: చంద్రబాబు

APలోని ప్రతి కుటుంబానికీ ఫ్యామిలీ కార్డు జారీ చేయాలని CM చంద్రబాబు నిర్ణయించారు. ఫ్యామిలీ బెన్ఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై CM సమీక్షించారు. ఈ కార్డులో ప్రభుత్వ పథకాలు సహా అన్ని వివరాలు పొందుపరచాలని అధికారులను ఆదేశించారు. ఆధార్‌లా ఫ్యామిలీ కార్డును ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాల కోసం కుటుంబాలు విడిపోయే పరిస్థితి రాకూడదని, అందరికీ లబ్ధి కలిగేలా స్కీంలు రీ-డిజైన్ చేసేలా చూడాలని చెప్పారు.
Similar News
News August 28, 2025
ఆస్తి, ప్రాణ, పంట నష్టం జరగకూడదు: సీఎం రేవంత్

TG: భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎలాంటి ఆస్తి, ప్రాణ, పంట నష్టం జరగకుండా చూడాలని సూచించారు. ‘వాగులు పొంగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. హైలెవెల్ బ్రిడ్జిలు నిర్మించాలి. ఫొటో, వీడియో క్యాప్చర్ ద్వారా పంట నష్టం అంచనా వేయాలి. సమగ్ర వివరాలను భద్రపరచాలి. వర్షపాతం వివరాలు కూడా ప్రజలకు తెలియజేయాలి’ అని ఆయన దిశానిర్దేశం చేశారు.
News August 28, 2025
సెప్టెంబర్ 7న ఎరుపు రంగులో చంద్రుడు

వచ్చే నెల 7న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఆ రోజు రాత్రి 8.58 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు తెల్లవారుజామున 1.25 గంటల వరకు ఉంటుంది. ఆ రోజు చందమామ ఎరుపు రంగులో ఉంటాడు. దీంతో చంద్రుడిని బ్లడ్ మూన్ కూడా పిలుస్తారు. మన దేశంలో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, పుణే, లక్నో, హైదరాబాద్, చండీగఢ్ ప్రాంతాలవారు దీనిని వీక్షించవచ్చు. ఆస్ట్రేలియా, అమెరికా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో నేరుగా, స్పష్టంగా చూడొచ్చు.
News August 28, 2025
ఎల్లుండి కుప్పంలో చంద్రబాబు పర్యటన

AP: సీఎం చంద్రబాబు ఈ నెల 30న కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రేపు సా.6 గంటలకు శాంతిపురం(మం) తుంసి చేరుకోనున్నారు. కడపల్లె స్వగృహంలో రేపు రాత్రి బస చేసి, ఎల్లుండి పరమసముద్రం గ్రామంలో హంద్రీ-నీవా కాలువకు గంగాహారతి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం స్థానిక బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత పారిశ్రామికవేత్తలతో అవగాహన ఒప్పందాల కార్యక్రమంలో పాల్గొంటారు.